రొమాన్స్ లో నేను చాలా వీక్: కళ్యాణ్ రామ్

kalyan ram about na nuvve movie
Highlights

కళ్యాణ్ రామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి కూడా మాస్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను 

కళ్యాణ్ రామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి కూడా మాస్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తూ వస్తున్నాడు. అయితే మొదటిసారి రొమాంటిక్, లవ్ ఎంటర్టైనర్ లో నటించాడు. అదే 'నా నువ్వే'. ఈ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కొత్త కళ్యాణ్ రామ్ ను చూడొచ్చు.

అతడి లుక్ ను పూర్తిగా మార్చేశాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కావొస్తుండడంతో కళ్యాణ్ రామ్ లో టెన్షన్ పెరిగిందట. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో టెన్షన్ గా ఉందంటూ కళ్యాణ్ అన్నాడు. అయితే ఈ సినిమా విషయంలో ఒక వ్యక్తి ఇచ్చిన కాంప్లిమెంట్ మాత్రం మర్చిపోలేనని అంటున్నాడు. అతను ఎవరో కాదు.. కళ్యాణ్ రామ్ కొడుకు శౌర్య. ఈ సినిమాలో కళ్యాణ్ ను చూసిన శౌర్య 'నాన్న ఇప్పటివరకు నువ్వు చేసిన అన్ని సినిమాలలో కంటే ఇందులో చాలా బాగున్నావ్.. అందంగా కనిపిస్తున్నావని.. చెప్పినట్లు కళ్యాణ్ వెల్లడించారు.

ఈ సినిమాలో పీహెచ్ డి పూర్తి చేసి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలనుకునే కుర్రాడి పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. అలానే తన పాత్రకు మరో షేడ్ కూడా ఉంటుందని చెబుతున్నాడు. ఇక తను రొమాంటిక్ సీన్లలో చేయడానికి చాలా కష్టపడినట్లుఆ విషయంలో తను చాలా వీక్ అయినప్పటికీ దర్శకుడు తనతో బాగానే చేయించాడని చెప్పారు.
 

loader