చిరంజీవి హీరోగా నటిస్తున్న `ఆచార్య`కి మొదట నుంచీ సమస్యలే. అసలే ఆ సినిమా సెట్స్పైకి వెళ్లడానికే బోలెడంత సమయం పట్టింది..బాగా లేటు అనుకుంటూంటే ఇంకొన్ని సమస్యలు ఈ సినిమాని వెంటాడుతున్నాయి.  ముఖ్యంగా హీరోయిన్ ఎంపిక గురించైతే ఓ పెద్ద సమస్యనే ఎదుర్కొంటున్నారు. చాలా మందిని పరిశీలించాక ఆఖరికి త్రిషని ఎంపిక చేసుకుని  ముందుకు నడిపిద్దామనుకున్నారు.  అయితే ఊహించని విధంగా త్రిష సినిమా నుంచి తప్పుకున్నట్టు ప్రకటించింది.

దాంతో  ఇప్పుడు చిరు సరసన నటించే ఆ  హీరోయిన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. దాంతో ఈ చిత్రం టీమ్ ..త్రిష ప్లేస్ లోకి కాజల్ ని తీసుకువచ్చారు. చిరంజీవి స్వయంగా రికమెండ్ చేసారుట. తన సినిమా అంటే ఎదురు ప్రశ్న అడగకుండా వెంటనే ఓకే చేస్తుందన్నట్లుగా చిరు హామీ ఇవ్వటంతో వెంటనే ఆమెను కాంటాక్ట్ చేసారట. అయితే ఇదే అదను అనుకుని ఆమె చిరు ప్రపోజల్ కు షాక్ ఇచ్చేలా రేటు చెప్పిందిట.

అయితే కాజల్ చాలా తెలివైంది. ఈ సిట్యువేషన్ ని క్యాష్ చేసుకోవాలనుకుంటోందిట. వరసగా సీత, రణరంగం డిజాస్టర్స్ తో ఆమెకు అసలు డిమాండ్ లేదు. దాంతో రేటు తగ్గించుకుని ట్రైల్స్ వేస్తోంది. అయితే ఇప్పుడు చిరు చిత్రం టీమ్ కు ఉన్న అర్జెన్సీ వియషం తెలుసుకుని ఒక్కసారిగా రేటు పెంచేసి షాక్ ఇచ్చిందిట. సీనియర్ హీరో ప్రక్కన చెయ్యాలంటే ఆ మాత్రం డిమాండ్ ఉంటోంది అని శెలవిస్తోందిట. పోనీ కాజల్ చిన్న పిల్లా అంటే 33 సంవత్సరాల సీనియర్. యంగ్ హీరోలెవరూ ఆమెతో చేయటానికి ఉత్సాహం చూపించటం లేదు. ఆమె చేతిలో ఇప్పుడు కమల్ తో చేస్తున్న భారతీయుడు2 మాత్రమే ఉంది. అయినా సరే చిరు సినిమాకు భారీ మొత్తం అడిగింటిదట.గతంలో ఖైదీ నెంబర్ 150లో చిరంజీవికు జోడీగా చేసింది.
  
ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మహేష్ నటిస్తాడా లేదా అన్నది కూడా క్వచ్చిన్ గా మారింది. మొదట ఆ పాత్రను రామ్ చరణ్ చేత చేయిద్దామనుకున్నారు. అయితే రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ చిత్రం అనుకున్న షెడ్యుల్ ప్రకారం షూట్ జరగకపోవటంతో ఆయన చేయటానికి లేకపోయింది. దాంతో మహేష్ ని సీన్ లోకి తెద్దామని కొరటాల శివ విశ్వప్రయత్నం చేస్తున్నాడు. మహేష్, చిరంజీవి కాంబో అంటే ఓ రేంజిలో బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నాడు. అలాగే ఓపినింగ్స్ సైతం అదిరిపోతాయి.