సెక్స్ రాత్రి మాత్రమే చేస్తారా.. పగలు చేయరా.. కండోమ్ పై ముద్దుగుమ్మలు..

సెక్స్ రాత్రి మాత్రమే చేస్తారా.. పగలు చేయరా.. కండోమ్ పై ముద్దుగుమ్మలు..

ప్రముఖ సినీతారలు కాజల్ అగర్వాల్, తాప్సీలతోపాటు సీనియర్ హిరోయిన్లు ఖుష్బు సుందర్ మరియు గౌతమి లాంటి హిరోయిన్లకు ఎంత క్రేజ్ వుందో తెలిసిందే. ఈ క్రేజీ హీరోయిన్లు సెక్స్ గురించి ఏం మాట్లాడినా అది సంచలనమే. అలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు ఈ సుందరీమణులు.

 

భారత దేశంలో కండోమ్ వాడకం, ప్రకటనలపై అభిప్రాయాలు కోరుతూ... ఇండియా టుడే కాన్ క్లేవ్ 2018 లో 'విమెన్ ఇన్ పబ్లిక్ లైఫ్: ది పర్సనల్ ఈజ్ పొలిటికల్' అనే అంశంపై చర్చలో ప్రశ్న ఎదురైంది. ఈ చర్చా గోష్టిలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు టీవీల్లో కండోమ్ ప్రకటనలపై నిషేధం విధించడంపై తమ అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

"మన జనాభాను నియంత్రించాలనుకుంటే, మనము కండోమ్ ప్రకటనలను చూపించాలి" అని కాజల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. తాప్సీ కూడా కాజల్ అన్నమాటకి జై కొట్టింది. దేశంలో అధిక జనాభా ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటనలను వేస్తే తప్పేమి లేదని అన్నారు.

 

నటి, రాజకీయ నేత ఖుష్బు సుందర్ కూడా  "రాత్రి 11 తర్వాత మాత్రమే మీరు కండోమ్ ప్రకటనలను టీవీల్లో ప్రసారం చేస్తారనటం హాస్యాస్పదంగా ఉంది. సెక్స్ రాత్రి మాత్రమే కాదు.. పగలు కూడా చేస్తారు కదా" అని చెప్పారు. గౌతమి 'సంతానోత్పత్తి', 'సురక్షిత సెక్స్' అంశాలను ప్రస్తావిస్తూ.. టీవీల్లో కండోమ్ నిషేధాన్ని వ్యతిరేకించారు. మొత్తంగా సెక్స్ పట్ల మన దృక్పథం మారాలని ఖచ్చితంగా

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page