స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన మిత్రుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 30న ఘనంగా పెళ్లి జరుపుకున్న ఈ జంట లాంగ్ హనీమూన్ వెకేషన్ గడిపారు. పెళ్ళైన వెంటనే మాల్దీవ్స్ వెళ్లిన కాజల్, గౌతమ్  అక్కడ మూడు వారాల వరకు ఎంజాయ్ చేశారు. మాల్దీవ్స్ తో భర్త కిచ్లుతో కాజల్ గడిపిన ఆనంద క్షణాలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అయ్యాయి. ఇటీవలే వెకేషన్ ముగించుకొని ఆచార్య షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయ్యారు కాజల్. వస్తూ వస్తూ భర్త గౌతమ్ ని కూడా సెట్స్ కి తీసుకువచ్చారు. 
 
నవ దంపతుల చేత కేక్ కట్ చేయించిన చిరంజీవి... వాళ్ళను ఆశీర్వదించడం జరిగింది. ఐతే భార్య కాజల్ ని తన వ్యాపార అభివృద్ధికి వాడేస్తున్నాడు గౌతమ్ కిచ్లు. తన ఫర్నిచర్ బ్రాండ్ కి ప్రచార కర్తగా కాజల్ ని ఉపయోగిస్తున్నారు. గౌతమ్ కిచ్లు ఫర్నిచర్ మరియు హౌస్ హోల్డ్ వ్యాపార సంస్థను నడుపుతున్నారు. ఈ సంస్థ ఉత్పత్తులకు ఆదరణ పెరిగేలా కాజల్ కొన్ని ప్రచార వీడియోలు చేశారు. ఆ వీడియోల ద్వారా కాజల్ సంస్థకు ప్రచారం కల్పించే పనిలో పడ్డారు. 
 
కాజల్ ని చేసుకున్న గౌతమ్ కి టు ఇన్ వన్ ఆఫర్ తగిలినట్లు అయ్యింది. ఒకవైపు భార్యగా, మరో వైపు వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడే మోడల్ గా ఉపయోగపడుతుంది. ఈ విషయంలో అదృష్టం అంటే కాజల్ భర్త గౌతమ్ దే అనుకోవాలి. ప్రస్తుతం కాజల్ పూర్తి చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. కొరటాల-చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంతో పాటు తెలుగులో మోసగాళ్లు మూవీలో కాజల్ నటిస్తున్నారు. తమిళంలో కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరక్కుతున్న భారతీయుడు 2 చిత్రంలో కూడా కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.