బ్యూటీ కాజల్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ పంచుకున్నారు. తన అందమైన గ్లామరస్ ఫొటోతో పాటు ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టింది. ' మేఘంలో ప్రయాణం తెలియని గమ్యం వైపు' అని ఓ అంతుబట్టని వాక్యాన్ని రాసింది. మరి కాజల్ గమ్యం లేని ప్రయాణం ఎందుకు చేస్తుందో అర్థం కాలేదు. చేతినిండా ఆఫర్స్ తో బిజీగా ఉన్న కాజల్ ఫిలాసఫీ చెప్పాల్సిన అవసరం ఏముందని కొందరు అనుకుంటున్నారు. ఒక వేళా లాక్ డౌన్ వలన షూటింగ్స్ లేక బోర్ కొట్టి ఇలా కొటేషన్స్ పెడుతుందేమో అనిపిస్తుంది. 

అరుదుగా సోషల్ మీడియాలో సందడి చేసే కాజల్ తాజా పోస్ట్ ఆమె ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతోంది. ఇక లేటెస్ట్ ఫొటోలో కాజల్ గ్లామర్ అదిరింది. దశాబ్దానికి పైగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న కాజల్ గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని అర్థం అవుతుంది. యంగ్ హీరోయిన్స్ కి కూడా లేనన్ని ఆఫర్స్ ప్రస్తుతం కాజల్ చేతిలో ఉన్నాయి. 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య మూవీలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం ద్వారా రెండోసారి చిరుతో కాజల్ జతకడుతుంది. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు 2 చిత్రంలో కూడా కాజల్ ప్రధాన హీరోయిన్ గా నటించారు. వీటితో పాటు తెలుగులో మోసగాళ్లు అనే మరో చిత్రంలో కాజల్ నటిస్తున్నారు. హిందీ హిట్ మూవీ క్వీన్ తమిళ్ రీమేక్ లో కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.