జ్యోతిక 'పొన్‌మగల్‌ వందాల్‌' రివ్యూ

తమిళ చిత్ర ఎగ్జిబిటర్స్‌ అసొసియేషన్‌ అభ్యంతరాలు, వివాదాల మధ్య  జ్యోతిక తాజా చిత్రం ఓటీటిలో రిలీజైంది. సూర్య తన సొంత బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించానని చెప్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలను ఏ మేరకు ఈ సినిమా అందుకుంది. సినిమా థియోటర్ లో రిలీజైతే ఘన విజయం సాధించే అవకాశం మిస్ చేసుకున్నట్లేనా లేక ఓటీటిలోనూ భారీగానూ రెవెన్యూ రాబడుతుందా..అసలు సినిమా కథేంటి...మరిన్ని సినిమాలు ఓటీటిలో రిలీజ్ చేసేందుకు ఈ సినిమా సానుకూల ధోరణిని సృష్టిస్తుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 
 

jyothika Ponmagal Vandhal Movie Review

తమిళ చిత్ర ఎగ్జిబిటర్స్‌ అసొసియేషన్‌ అభ్యంతరాలు, వివాదాల మధ్య  జ్యోతిక తాజా చిత్రం ఓటీటిలో రిలీజైంది. సూర్య తన సొంత బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించానని చెప్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలను ఏ మేరకు ఈ సినిమా అందుకుంది. సినిమా థియోటర్ లో రిలీజైతే ఘన విజయం సాధించే అవకాశం మిస్ చేసుకున్నట్లేనా లేక ఓటీటిలోనూ భారీగానూ రెవిన్యూ రాబడుతుందా..అసలు సినిమా కథేంటి...మరిన్ని సినిమాలు ఓటీటిలో రిలీజ్ చేసేందుకు ఈ సినిమా సానుకూల ధోరణిని సృష్టిస్తుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

కథేంటి:
2004లో  ఓటీ దగ్గర నీలగిరిలో వరస పెట్టి చిన్న పిల్లల కిడ్నాప్ లు మర్డర్స్ జరుగుతాయి. జనం భయభ్రాంతులు అవుతారు. పోలీస్ ల మీద ఒత్తిడి పెరగుతుంది. వాళ్లు ఎంక్వైరీ చేసి పట్టుదలగా కొద్ది రోజులులోనే జ్యోతి అనే ఓ నార్త్ ఇండియన్ స్త్రీ ఇవన్నీ చేస్తోందని, ఆమె ఓ సైకో కిల్లర్ అని పట్టుకుంటారు. ఆ చనిపోయిన పిల్లల తల్లి తండ్రులు ఆమెను వదలకూడదంటూ ఆందోళన చేస్తారు. చివరకు ఆమె ఎనకౌంటర్ లో చనిపోతుంది. ఆ కేసు అలా ముగిసిపోతుంది.

ఇది జరిగిన పదిహేళ్లకు పిటీషన్ పేతురాజ్ (భాగ్యరాజ్) ఈ కేసుని తన కూతురు వెన్బా (జ్యోతిక) సాయింతో రీ ఓపెన్ చేస్తాడు. వెన్బా కు అదే మొదటి కేసు. ఆమె కోర్టులో ...ఆమె సైకో కిల్లర్ కాదని వాదించటం మొదలెడుతుంది. పోలీస్ డిపార్టమెంట్ ని కోర్టుకు లాగుతుంది. మొదట ఎవరూ సీరియస్ గా తీసుకోరు. తర్వాత అలాంటి దుర్మార్గమైన పనిచేసిన సైకో కిల్లర్ కేసు ఓపెన్ చేస్తావా అని జనం ఆమెను తిట్టడం మొదలెడతారు. శాపనార్దాలతో దుమ్మెత్తిపోస్తారు. అయినా వెన్బా వెనకడుగు వెయ్యదు. అసలు ఆ సైకో కిల్లర్ అని చెప్పబడుతున్న జ్యోతి..నార్త్ ఇండియన్ కాదని, తమిళయన్ ఆధారాలతో ప్రూవ్ చేస్తుంది. తమిళం వాళ్లకు నార్త్ ఇండియన్స్ మీద ఉన్న కోపాన్ని రెచ్చగొట్టి అమాయికురాలైన జ్యోతిని ఇరికించారని అంటుంది. ఆధారాలన్నీ ఆమెకు వ్యతిరేకంగా ఉంటాయి. మరో ప్రక్క వరదరాజన్ (త్యాగరాజన్) ఈ కేసు ఓపెన్ చేసిన దగ్గర నుంచి కంగారుపడుతూంటాడు. ఓ సమర్దడైన లాయిర్ రాజారత్నం (పార్దీపన్)ని పబ్లిక్ పాసిక్యూటర్ గా రంగంలోకి దించుతాడు. ఈ క్రమంలో ఓ నిజం రివీల్  చేస్తుంది వెన్బా. తాను మరెవరో కాదని ఆ సైకో కిల్లర్ అని చెప్పబడుతున్న జ్యోతి కుమార్తెని అంటుంది. అక్కడ నుంచి తన తల్లిని నిర్ధోషి అని ప్రూవ్ చేయటానికే ఇలా కేసు తిరగతోడిందని ఆరోపిస్తారు. అప్పుడు ఏం జరిగింది. అసలు జ్యోతి నిజంగా సైకో కిల్లరేనా. ఈ కేసుకు వరదరాజన్ కు సంభందం ఏమిటి, అసలు ఏం జరిగింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
 
ఎలా ఉంది:
సినిమా పాయింట్ పెద్ద గొప్పగా అనిపించదు. జాలీ ఎల్ ఎల్ బి సినిమా చూసి రాసుకున్న స్క్రిప్టులా అనిపిస్తుంది. ఇంట్రవెల్ ట్విస్ట్ ని నమ్ముకుని చేసారనిపిస్తుంది. కోర్టు సీన్స్‌లో మెలోడ్రామా ఎక్కువైంది. జ్యోతిక తన నటనతో చాలా సార్లు కట్టిపారేస్తుంది. అయితే దర్శకుడు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కదా.. ఫైట్స్ గట్రా ఎలాగూ పెట్టలేము అని సెంటిమెంట్ తో నింపేసాడని అర్దమవుతుంది. ఓ క్రైమ్ థ్రిల్లర్ కావాల్సిన కాన్సెప్టుని కోర్టు రూమ్ డ్రామా గా మార్చారు. ఎక్కువ శాతం కోర్టులోనే నడుస్తుంది. ఇక విలన్ ఫలానా అని అర్దమయినా, అతని వైపు నుంచి పెద్దగా అపోజ్ చేయటం ఉండదు. దాంతో పెద్ద కాంప్లిక్ట్ పండలేదు. విలనిజం మరింత స్ట్రాంగ్ ఉంటే బాగుండేది. అప్పుడు జ్యోతిక పాత్ర మరింత ఎలివేట్ అయ్యేది. పోనీ రియలిస్టిక్ గా తీసారు అనుకుందామంటే విలన్ చేస్టలు,వార్నింగ్ లు  పక్కా కమర్షియల్ సినిమా ని గుర్తు చేస్తుంటాయి. 

దర్శకత్వం, మిగతా విభాగాలు:
ఇలాంటి సినిమాలకు ఎంత కొత్త పాయింట్ , నావల్టీ నేరేషన్ ఉంటే అంతగా బాగుంటాయి. అవే కొరబడ్డాయి. ఈ సినిమా స్క్రీన్ ప్లే, డైలాగులు రాసి దర్శకత్వం వహించిన ఫెడ్రిక్...ట్విస్ట్ లతో మెస్మరైజ్ చేద్దామనుకున్నారు. అయితే ఆ ట్విస్ట్ ల్లో ఎక్కువ శాతం మనం ఊహించగలిగేవే. ఇక దర్శకుడు ఫెడ్రిక్ మంచి క్రైమ్ థ్రిల్లర్ కు సరపడ కథాంశం తీసుకున్నా ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేదు. కొన్ని సన్నివేశాలు బాగా బోర్ సాగుతాయి. జ్యోతిక మాత్రం న్యాయం కోసం పోరాడే లాయిర్ గా అదరకొట్టింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో విలన్ వరదరాజన్ ని కోర్టులో ఢీ కొట్టే సన్నివేశాల్లో జ్యోతిక నట విశ్వరూపం కనిపిస్తుంది.  కీలకపాత్ర చేసిన భాగ్యరాజ్..వయస్సు బాగా మీదపడింది. హీరోగా ఆయన్ను చూసిన మనం ఇలా ఉన్నాడేంటి అనుకుంటాం. జడ్జిగా ప్రతాప్ పోతన్ ఎప్పటిలాగే బాగా చేసారు. ఇక క్లైమాక్స్ లో ఏదో ఊహించనిది ఏదో ఉంటుందనుకుంటే...తన కన్నీళ్లతో జడ్జిని కన్వీన్స్ చేసే జ్యోతిక కనపడి ఉసూరుమనిపిస్తుంది. అయితే సినిమాకు బేస్ గా తీసుకున్న చిన్నారులపై లైంగిక దాడి అంశం మాత్రం ఖచ్చితంగా చర్చించదగినదే. 

టెక్నికల్ గా చూస్తే సినిమాలో హై స్టాండర్డ్స్ కాదు కానీ మంచి స్దాయిలోనే సాంకేతిక విలువలు ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ ఆయింది.  సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఫైనల్ థాట్‌:
ఓటీటిలో రిలీజ్ కాకపోతే ఏ లాయర్ జ్యోతి అనే టైటిల్ తోనో లేక జ్యోతి ఎల్ ఎల్ బి అనే టైటిల్ తోనే థియోటర్ లో తెలుగులో డబ్బింగ్ వెర్షన్ చూద్దుము.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios