Asianet News TeluguAsianet News Telugu

పెళ్లికి ముందు సెక్స్ : సెగపుట్టిస్తున్న జ్వాల

  • పద్మ అవార్డుల ఎంపిక విధానం పై వార్ ప్రకటించిన జ్వాలాగుత్తా
  • రీసెంట్ గా  ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన బ్యాడ్మింటన్ స్టార్ జ్వాల
  • పనిలో పనిగా సెక్స్ గురించి తన అభిప్రాయం వెల్లడించిన జ్వాల
  • పెళ్లికి ముందు సెక్స్ చేస్తే తప్పేముందని వ్యాఖ్యానించిన జ్వాల
jwala gutta says sex before marriage not a sin

పద్మ అవార్డుల ఎంపిక విధానంపై వార్ ప్రకటించి సంచలనం సృష్టించింది భారత బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా. ప్రస్థుతం తనదైన లైఫ్ గడుపుతున్న జ్వాల రీసెంట్ గా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్ళికి ముందు సెక్స్ తప్పు కానే కాదని తేల్చి చెప్పింది అందాల బ్యాడ్మింటన్ తార. సరైన ప్రోత్సాహం లేక ఆటలో వెనకబడ్డా తాను సాధించిన దానికి గర్వంగా ఫీలవుతున్నానని చెప్తుంటుంది జ్వాల.

 

చేతన్ ఆనంద్ తో విడాకులు తీసుకున్నాక ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నానని కూడా స్పష్టం చేసింది. స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినప్పటికీ సినిమాలపై అలాగే రాజకీయాలపై కూడా ఆసక్తి ఉంది గుత్తా జ్వాలకు. ఆమధ్య నితిన్ హీరోగా నటించిన గుండె జారి గల్లంతయ్యిందే చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది జ్వాల. అలా అందాలు ఆరబోసి ఇటు బ్యాడ్మింటన్ ఫ్యాన్స్ లో, అటు సినీ ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసింది.

 

ప్రస్థుతం బ్యాడ్మింటన్  డబుల్స్ కూడా దూరంపెట్టిన జ్వాల రాజకీయాలపై తన ఆసక్తిని వెలిబుచ్చింది. సినిమాలు చేయటం అంతగా ఇష్టంలేదని, కేవలం నితిన్ కోసం సాంగ్ లో చేశానని చెప్తుంది జ్వాల. అయితే రాజకీయాలంటే ఆసక్తి ఉందని, బ్యాడ్మింటన్ క్రీడ కోసమే కాక, రాజకీయాల్లోనూ తన వంతుగా ప్రజా సేవ చేయాలనే ఆసక్తిని కనబరుస్తోంది.

 

ప్రస్థుతం పవన్ కళ్యాణ్ తో కలిసి జనసేన తరుపున ప్రచారం చేయడానికి సన్నాహాలు చేస్తోందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి పెళ్ళికి ముందు సెక్స్ లో పాల్గొంటే తప్పు కాదని సంచలన వ్యాఖ్యలు చేసిన బ్యాడ్మింటన్ క్వీన్ గుత్తా జ్వాల సెన్సేషన్ క్రియేట్ చేసింది. సానియా మీర్జా కూడా గతంలో ఇలాంటి అభిప్రాయమే వెలిబుచ్చిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios