Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ కేసులో వాసు వర్మ అరెస్ట్.. అసలు జరిగింది ఇదీ, క్లారిటీ ఇచ్చిన జోష్ డైరెక్టర్

టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం మొదలయింది. నార్కోటిక్స్ అధికారులు, పోలీసులు వరుసగా అనుమానితులపై రైడ్ చేస్తూ హైదరాబాద్ లో పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు.

Josh director Vasu Varma gives clarity on drugs case dtr
Author
First Published Sep 25, 2023, 5:04 PM IST

టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం మొదలయింది. నార్కోటిక్స్ అధికారులు, పోలీసులు వరుసగా అనుమానితులపై రైడ్ చేస్తూ హైదరాబాద్ లో పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఆ మధ్యన నిర్మాత కెపి చౌదరిని అరెస్ట్ చేయడం చూశాం. ఆ తర్వాత ఇండస్ట్రీకి చెందిన సుశాంత్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. 

అలాగే హీరో నవదీప్ కి కూడా డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నట్లు వరుసగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ తరుణంలో నార్కోటిక్స్ అధికారులు, పోలీసులు మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వాసు వర్మ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనితో నాగ చైతన్య 'జోష్' మూవీ డైరెక్టర్ వాసు వర్మ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్లు పలు మీడియా సంస్థలలో కథనాలు వెలువడ్డాయి. 

దీనితో డైరెక్టర్ వాసు వర్మ స్వయంగా వీడియో బైట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. 'హాయ్ నా పేరు వాసు వర్మ జోష్ మూవీ డైరెక్టర్ ని. నిన్న మధ్యాహ్నం నుంచి నా గురించికొన్ని వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో నేను అరెస్ట్ అయినట్లు నా ఫోటో పేరు వాడుతూ కథనాలు ప్రచురిస్తున్నారు. కానీ నాకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. నన్ను ఎవరూ అరెస్ట్ చేయలేదు. ఇలా మీ ముందే ఉన్నాను. నా వర్క్ తో నేను బిజీగా ఉన్నాను. 

అయితే ఈ వార్త ఎలా వచ్చింది అని ఆరా తీస్తే.. నా పేరుతోనే వాసు వర్మ అనే మరొకరు ఇండస్ట్రీలో ఉన్నారట. బహుశా ఆయన్ని అరెస్ట్ చేసి ఉండొచ్చు. జోష్ డైరెక్టర్ అంటూ తప్పుగా ప్రచురించిన వారంతా తమ తప్పుని సరిచేసుకోవాలని వాసు వర్మ కోరారు. వాసు వర్మ డైరెక్టర్ గా జోష్, కృష్ణాష్టమి లాంటి చిత్రాలని తెరకెక్కించారు. పలు చిత్రాలకు కో డైరెక్టర్ గా, అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios