Asianet News TeluguAsianet News Telugu

ఇంట్రస్టింగ్ థ్రిల్లర్: 'జీవి' రివ్యూ

తమిళంలో కొత్తవారితో కొత్త దర్శకుడు తీసిన ఈ చిత్రం కమర్షియల్ గానూ డబ్బులు తెచ్చిపెట్టింది. జనాలకు నచ్చింది. మరి మన తెలుగు జనాలకు ఏ స్దాయిలో నచ్చుతుందో..అసలు పట్టించుకుంటారో లేదో రివ్యూలో చూద్దాం. 
 

JIIVI telugu MOVIE REVIEW jsp
Author
Hyderabad, First Published Jun 25, 2021, 3:35 PM IST

 తెలిసిన ఆర్టిస్ట్ లు పెద్దగా లేకపోయినా, డబ్బింగ్ అయినా ఫర్వాలేదు. కేవలం కట్టిపాడేసే కంటెంట్ ఉంటే చాలు అనే పద్దతికి ఓటీటిలు ప్రేక్షకులను తీసుకెళ్ళిపోతున్నాయి. ముఖ్యంగా ఓటీటిలలో రియలిస్టిక్ ఎప్రోచ్ ,క్రైమ్ కంటెంట్ ఉన్న సినిమాలు బాగా క్లిక్ అవుతున్నాయి. వీటిని గమనించిన ఆహా ఓటీటి వారు మొన్నటి దాకా మళయాళ డబ్బింగ్ లతో దండయాత్ర చేస్తే ఇప్పుడు తమిళంపై తమ దృష్టిని పెట్టారు. ఈ క్రమంలో దిగిన చిత్రమే జీవి. తమిళంలో కొత్తవారితో కొత్త దర్శకుడు తీసిన ఈ చిత్రం కమర్షియల్ గానూ డబ్బులు తెచ్చిపెట్టింది. జనాలకు నచ్చింది. మరి మన తెలుగు జనాలకు ఏ స్దాయిలో నచ్చుతుందో..అసలు పట్టించుకుంటారో లేదో రివ్యూలో చూద్దాం. 

కథేంటి

చిన్నతనం నుంచి ప్రాక్టికల్ ఎడ్యుకేషనే నిజమైన నాలెడ్జ్ అని నమ్ముతాడు శ్రీనివాస్‌(వెట్రి). దాంతో  స్కూల్ డ్రాపవుట్ గా మిగిలిపోతాడు. అయితే స్కూల్ కు వెళ్లి చదవకపోయినా లైబ్రరీకి వెళ్లి రకరకాల పుస్తకాలు చదువుతాడు. ఇంట్లో ఆర్దిక ఇబ్బందులతో తన ఉన్న ఊరు వదలి  హైదరాబాద్ వచ్చి అక్కడో జ్యూస్ షాప్ లో పనికి కుదురుతాడు. తన రూమ్ మేట్ మణి (కరుణాకరన్) లేట్ నైట్ షోలు చూస్తూంటే తను మాత్రం ..ఇన్ఫోమెంట్ ఛానెల్స్ చూడటానికే ప్రయారిటి ఇస్తాడు. ప్రతీది లాజిక్ గా అలోచించే అతను నీతులు, విలువలు వంటివాటికి పెద్ద ప్రయారిటీ ఇవ్వడు. అలా ఉన్న శ్రీనివాస్ తన షాపు ఎదురుగా ఉన్న మరో షాపులో పనిచేసే ఆనంది(మోనికా) ని ఇష్టపడుతాడు. అయితే ఆమె ప్రాక్టికల్ గా ఆలోచించి..జ్యూస్ షాపులో పనిచేసే వాడితో జీవితం ఏం ఉంటుందని వేరే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాడితో పెళ్లికు ఓకే చెప్తుంది. 

హర్టైన శ్రీనివాస్ డబ్బుకు ఉన్న ప్రయారిటీ మరో సారి గుర్తుకు వస్తుంది. దాంతో తప్పు చేసైనా సరే జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటాడు. అందుకోసం తన అద్దె ఇంటి ఓనర్ లక్ష్మి(రోహిణి)  దొంగతనం ప్లాన్ చేస్తాడు.అన్ని జాగ్రత్తలు తీసుకుని నగలు దోచేస్తాడు. వేరే వాడిని ఆ కేసులో ఇరికిస్తాడు. కానీ పోలీస్ లు అతన్ని,రూమ్ మేట్ మణిని అనుమానిస్తారు. ఈలోగా మరో విషయం రివీల్ అవుతుంది. ఇంటి ఓనర్  లక్ష్మీ జీవితంలో ఎదురైన సంఘటనలే శ్రీనివాస్‌ జీవితంలో ఎదురవ్వటం మొదలవుతుంది. అలా ఎందుకు జరుగుతోంది.. అప్పుడు శ్రీనివాస్ ఏం చేసాడు..ఆ కేసు నుంచి ఎలా బయిట పడ్డాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉంది

తమిళంలో నెగిటివ్ పాత్రలను పెట్టి థ్రిల్లర్స్ గతంలో తిరుత్తు పయిలే వంటివి తీసారు. అవి బాగానే ఆడాయి. అదే క్రమంలో ఈ సినిమా కూడా బిగి సడలని స్క్రీన్ ప్లే తో సెకండాఫ్ నడిపించారు. ఫస్టాఫ్ కొంచెం స్లోగా కథలోకి వెళ్లినా, ఒక్కసారి క్రైమ్ లోకి కథ ప్రవేశించగానే ఇంట్రస్ట్ పెరుగుతుంది. మెల్లిమెల్లిగా కథ విస్తరణతో పాటు థ్రిల్స్ పెంచుకుంటూ పోయారు. అలాగే synchronicity అనే కాన్సెప్టు ని బాగా ప్రెజెంట్ చేసారు.  ఇద్దరు వ్యక్తులకు వేర్వేరు కాలాల్లో ఒకే రకమైన సంఘటనలు జరగడమనే  కాన్సెప్ట్‌ను థ్రిల్లింగ్‌గా రాసుకోవటమే కలిసొచ్చింది. ఇలాంటి కథలు చెప్పేటప్పుడు స్క్రీన్ ప్లే ఏ మాత్రం సరిగ్గా చేసుకోకపోయినా సినిమా చీదేస్తుంది. ఈ విషయం గమనించి అరటిపండు ఒలిచినట్లుగా సీన్స్ బాగా విసదీకరించారు. అయితే అదేంటన్నది మాత్రం సినిమా చూస్తేనే అర్దమవుతుంది. 

టెక్నికల్ గా..

డైరక్టర్  వి.జె.గోపీనాథ్‌ ఎంచుకున్న పాయింట్‌ కొత్తది. దాన్ని ఎలాంటి తడబాటు తెరకెక్కించాడు. తెలిసిన నటీనటులు ఉంటే, ఈ కథ మరో స్థాయిలో ఉండేదేమో. అలాగే డైరక్షన్ లో సింబాలిక్ గా తీసుకున్న ఎలిమెంట్స్ అయిన గదిలో తిరిగే ఫ్యాన్‌, గడియారం, కాకులు ఎగరడం నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. ప్రవీణ్‌ కె.ఎల్‌. ఎడిటింగ్‌ ఫరవాలేదు. సంగీతం పాటలు స్కిప్ చేసేస్తాం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.  ప్రవీణ్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. 

నటీనటుల్లో ..హీరో  వెట్రి కొత్తవాడైనా అది ఎక్కడా కనిపించదు.  హీరోయిన్ గురించి మాట్లాడుకోవటానికి ఆమెకు అసలు సీన్సే లేవు.  శ్రీనివాస్‌ స్నేహితుడిగా చేసిన కరుణాకరన్‌ బాగా చేసాడు కానీ పెద్దగా నవ్వించలేకపోయారు. మిగిలిన వారు తమ పరిధి మేరకు నటించారు. 

ఫైనల్ థాట్:
తెలుగులో రీమేక్ చేసినా బాగా ఆడేది,నెగిటివ్ హీరో అని ప్రక్కన పెట్టేసినట్లున్నారు
Rating:2.5
---సూర్య ప్రకాష్ జోశ్యుల

ఎవరెవరు...

నటీనటులు: వెట్రి, కరుణాకరన్‌, మోనికా, అనిల్‌ మురళి, టైగర్‌ గార్డెన్‌ తంగదురై, రోహిణి, మిమి గోపి, బోస్కీ తదితరులు; 
సంగీతం: కె.ఎస్‌.సుందర మూర్తి; 
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్‌ కుమార్‌; 
ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌; 
నిర్మాత: ఎం.వెల్లపాండియన్‌, సుధాలాయికన్‌ వెల్ల పాండియన్‌, సుబ్రమణియన్‌; 
రచన: బాబు తమిళ‌; 
దర్శకత్వం: వి.జె.గోపీనాథ్‌;
ఓటీటి: ఆహా
విడుదల తేదీ: 25,జూన్ 2021

Follow Us:
Download App:
  • android
  • ios