దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ త్వరలోనే హీరోయిన్ గా వెండితెరకు పరిచయం కానుంది. ఆమె నటిస్తోన్న 'ధడక్' సినిమా షూటింగ్ పూర్తి కావొస్తుంది. ఇటీవల వోగ్ మ్యాగజైన్ ఫోటో షూట్ లో పాల్గొని స్టైల్ విషయంలో నేటి స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని నిరూపించింది.

తాజాగా ఈ సంస్థ ఫోటో షూట్ కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో జాన్వీని చూస్తే ఆమెకు ఫిదా అవ్వకుండా ఉండలేం. తన అందాలను ప్రదర్శిస్తూనే.. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. దానిపై మీరు ఓ లుక్కేయండి