అతిలోక సుందరి శ్రీదేవి ఎంతగా గుర్తింపు తెచ్చుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆమె మరణం తరువాత కూతురు జాన్వీకి కూడా అంతే ఆదరణ దక్కుతోంది. శ్రీదేవిను జాన్వీ గుర్తు చేస్తోందని పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఇకపోతే రీసెంట్ గా జాన్వీ నెటిజన్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. 

సోషల్ మీడియాలో చాలా వరకు మానసిక రోగంతో బాధపడే వారు ఉన్నారని విషయం అర్ధం చేసుకోకుండా రేప్ చేస్తామంటూ తన సోదరిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు తెలిపింది. రీసెంట్ గా కరణ్ జోహార్ టాక్ షోలో పాల్గొన్న జాన్వీ ఒక టాస్క్ లో భాగంగా తన అక్క అన్షులాకి (బోణి కపూర్ మొదటి భార్య కూతురు) కాల్ చేసి ఒక విషయం గురించి అడగ్గా ఆమె సరదాగా దాన్ని తిరస్కరించారు. 

దీంతో కావాలని అన్షులా తన అక్కసును చూపించిందని శ్రీదేవి అభిమానులు ఒక్కసారిగా అన్షులాపై నెగిటివ్ కామెంట్స్ తో విరుచుకుపడ్డారు. అక్కపై ఆ విధంగా కామెంట్స్ చేస్తుండడంతో జాన్వి తట్టుకోలేకపోయింది. సోషల్ మీడియాలో మూర్ఖంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని జాన్వీ తనదైన శైలిలో వివరణ ఇచ్చింది.