హాలీవుడ్ తారలకు గ్లామర్ విషయంలో హద్దులు పెట్టుకోరు. హాలీవుడ్ అందాల తార జెన్నిఫర్ లారెన్స్ తాజాగా నటించిన చిత్రం రెడ్ స్పారో. ఇటీవల విడుదలైన చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. జెన్నిఫర్ అందాలు ఈ చిత్రానికి ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్ర షూటింగ్ లో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయం గురించి జెన్నిఫర్ తాజాగా వెల్లడించింది.

జెన్నిఫర్ ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో నగ్నంగా నటించింది. ఆ సన్నివేశంలో నగ్నంగా నటించాల్సిన అవసరం ఉందని భావించా. అందుకే నగ్నంగా కనిపించానని జెన్నిఫర్ తెలిపింది. ఆ సన్నివేశం చేసే సమయంలో నేను చిన్న పొరపాటు చేశాను. దానిని సరిచేయడానికి దర్శకుడు నా వద్దకు వచ్చారు. నా ఒంటిపై నూలు పోగు కూడా లేదు. కానీ ఆయన నన్ను బట్టలు ఉన్న అమ్మాయిలాగే చూశారు. నేను కూడా ఫీల్ కాలేదు. ఆయన కథ వివరించడానికి మాత్రమే నా వద్దకు వచ్చారు అని జెన్నిఫర్ తెలిపింది. ఆ సమయంలో సెట్ లో చాలా మంది ఉన్నారు. వారంతా చాలా ప్రొఫెషనల్స్. వారి దృష్టి పనిమీద ఉంది. కానీ నా మీద కాదు అని జెన్నిఫర్ తన న్యూడ్ సీన్ అనుభవాన్ని వివరించింది.