Asianet News TeluguAsianet News Telugu

చూస్తే మైండ్ బ్లాంక్: ఎన్టీఆర్ పాటకి జపాన్ జంట డ్యాన్స్

ఎన్టీఆర్‌కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయనకు ఇక్కడే కాదు జపాన్‌లో కూడా అభిమానులున్నారు.

Japanese Couple s NTR Dance Cover Is super
Author
Hyderabad, First Published Sep 15, 2020, 4:26 PM IST

టాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే  ఎన్టీఆర్ అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. అలాగే జపాన్‌లో కూడా ఉన్నారు. అక్కడ ఎన్టీఆర్ సినిమాలకు అభిమానుల సందడి బాగా ఉంటుంది కూడా. ఆ మధ్యన జనతా గ్యారేజ్ షూటింగ్ టైమ్ లో ఓ జపాన్ అభిమాని ఎన్టీఆర్ కోసం ఇక్కడ వరకు వచ్చి మరీ  ఫొటో తీసుకొని వెళ్లారు. 

ఇదిలా ఉంటే ఓ జపాన్ జంట ఇప్పుడు ఎన్టీఆర్ పాటలకు స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు. జూలైలో అశోక్ చిత్రంలోని ‘గోల గోల రంగోలా’, సింహాద్రిలోని ‘చీమ చీమ’ పాటలకు స్టెప్పులు వేసిన ఓ జంట.. తాజాగా కంత్రి సినిమాలోని ‘వయస్సునామి’ పాటకు డ్యాన్స్ కట్టారు.

ఈ పాటలో ఎన్టీఆర్ లా స్టెప్స్ వేసిన అతని పేరు Hiro Munieru. అతనో కాస్టూమ్స్ డిజైనర్ మరియు ఫొటో గ్రాఫర్. తన భార్య, ఇద్దరు పిల్లలు తో కలిసి క్రేజీ కవర్ సాంగ్స్ సరదాగా అప్పడప్పుడూ చేస్తూంటాడు. అలాగని అల్లాటప్పాగా చేయడు. ప్రాక్టీస్ చేసి, తన ఫ్యామలీని ఇన్వాల్వ్ చేస్తూ దుమ్ము రేపుతాడు. 
 
ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారగా.. అందరినీ తెగ నచ్చేస్తోంది. కేవలం ఎన్టీఆర్ అభిమానులనే కాదు ఇటు డ్యాన్స్‌ని ఇష్టపడే వారు కూడా వారిద్దరి స్టెప్పులకు ఫిదా అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను చూసేయండి.

Follow Us:
Download App:
  • android
  • ios