సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మరో భారీ చిత్రం ‘జన గణ మన’(JGM). ఈ చిత్ర షూటింగ్ ను తాజాగా ప్రారంభించారు. అదేవిధంగా పూజా హెగ్దేను కూడా అఫిషియల్ గా అనౌన్స్ చేస్తూ అప్డేట్ అందించారు.
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబినేషన్ లో తాజాగా మరో పాన్ ఇండియన్ మూవీ పట్టాలెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘జేజీఎం’అని టైటిల్ ను కూడా ఖరారు. మార్చి నెలలోనే టైటిల్ మోషన్ పోస్టర్ ఆర్మీ ఆఫీసర్స్ మధ్య గ్రాండ్ గా లాంఛ్ చేశారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ పూరీ దర్శకత్వంలో ‘లైగర్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియన్ మూవీ ఆగస్టు 26న రిలీజ్ కానుంది.
Liger పూర్తి కాగానే వెంటనే ‘జన గణ మన’పై పూరీ ఫోకస్ పెట్టారు. సినిమా అనౌన్స్ మెంట్, టైటిల్ లాంచింగ్, చిత్ర యూనిట్ సెటప్, ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ చకాచకా పూర్తయ్యాయి. తాజాగా సినిమా రెగ్యూలర్ షూటింగ్ ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. అయితే హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde)కు కూడా అఫిషియల్ గా ‘జేజీఎం’ సెట్ లోకి వెల్ కమ్ చెప్పారు. ఈరోజే షూటింగ్ ప్రారంభమైందని పూరీ జగన్నాథ్, నటి మరియు నిర్మాత చార్మీ కౌర్ కూడా తెలిపారు. పూజా హెగ్దే కూడా షూటింగ్ హాజరు కావడం సంతోషంగా ఉందని తెలిపారు.
పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న చిత్రం ‘జేజీఎం’. కొన్నేండ్లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు పూరీ జగన్నాథ్ ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఈ మూవీని తీయాలనుకున్నాడు. కానీ కుదరకపోవడంతో విజయ్ దేవరకొండతో పట్టాలెక్కిస్తున్నాడు పూరీ. ఇఫ్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. JGMని 2023 ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్, పూరి కనెక్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. నిర్మాతలు వంశీ పైడిపల్లి, ఛార్మికౌర్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
