'జల్లికట్టు' సినిమా రివ్యూ

  ఓ అడవి దున్నను  పట్టుకోవటానికి ఊరు ఊరంతా కదిలి పరుగులు తీస్తే  ఎలా ఉంటుంది...అసలు ఎలా ఎక్కడైనా జరుగుతుందా...ఇవేమన్నా ఆది మానవుడు రోజులా...బరెసలు, కత్తులు వేసుకుని అడవి దున్న వెనకబడటానికి ...వినటానికే విచిత్రంగా ఉంది కదా..కానీ అలాంటి సందర్బంకి  ముందు,వెనక కరెక్ట్ గా  ఉంటే ఖచ్చితంగా అదంతా మన ఎదురుగానే జరుగుదతున్నట్లు ఉంటుంది. మన మెదుడుని కంట్రోలు లోకి తెచ్చుకుని కన్వీన్స్ చేస్తుంది.  ఇదిగో ఈ సినిమా అలాంటిదే. ఆ మధ్యన మళయాళంలో వచ్చిన  ఈ జల్లికట్టు.. సినిమాలోపాయింట్ అదే. రిలీజుకి ముందే అనేక ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్స్లో ప్రదర్శనకి సెలక్ట్ అయిందీ ఈ మలయాళం మూవీ.. టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, బుసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై విమర్శకుల మెప్పు పొందింది. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా వేడుకలో పెల్లిస్సరీ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు.ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ అయ్యి..ఆహాలో  కూడా వచ్చింది. ఏమిటి ఈ సినిమాలో గొప్పతనం..అసలు కథేంటి.. వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

Jallikattu telugu Movie Review

కథేంటి

కేరళలోని ఓ అటవీ ప్రాంతం దగ్గరలో ఓ ఊరు. విన్సెంట్ (వినోద్) ఊరందరికీ బీఫ్ ని సరఫరా చేస్తూంటాడు. అతను తెచ్చి అమ్మే అడవి దున్న మాంసం అంటే అక్కడ వాళ్లకు పిచ్చి. ఓ రోజు ఎప్పటిలాగే విన్సెంట్ ...ఓ అడవి దున్న ని నరకటానికి సిద్దపడతాడు. అంతే అది ఒక్కసారిగా తప్పించుకుంటుంది. అక్కడ నుంచి అది ఊరుని తన పశు బలంతో వణికేలా చేస్తుంది. షాపులు కూల్చేస్తోంది. బ్యాంక్ లోకి వెళ్లి పర్నిచర్ నాశనం చేస్తుంది. అడవిలాంటి   ఊళ్ళోకి పారిపోయి పంట పొలాల్ని నాశనం చేస్తూ, అందర్నీ తన పదునైన కొమ్ములతో కుమ్మి వదులుతుంది.దాంతో   ఆ అడవి దున్నను పట్టుకుని చంపాని గ్రూప్ లుగా ఆ ఊరి జనం బయిలుదేరతారు. వారిలో పశు ప్రవృత్తి నిద్రలేస్తుంది. ఉచ్చం,నీచం అన్నది మర్చిపోయినట్లుగా రెచ్చిపోయి బిహేవ్ చేస్తారు. ఆ రాత్రంతా ఆ అడవి దున్న వేటలో ఆ ఊరు జనం తరిస్తారు. తెల్లారే లోగా దాన్ని పట్టుకోపోతే ..ఇక దాన్ని ఆపటం కష్టం అని వాళ్లందిరికీ తెలుసు. ఈ క్రమంలో ఆ రాత్రి, ఆ అడవిలో ..అడవి దున్న వేటలో అనేక సంఘనటలు జరుగుతాయి. అవేంటి..చివరకి అడవి దున్న ని వాళ్లు పట్టుకోగలిగారా...ఇందులో  పోలీస్ ల పాత్ర ఏమిటి..వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
  
ఎలా ఉంది

నిజానికి ఇలాంటి స్టోరీ లైన్ తో సినిమా చేయటం కత్తి మీద సామే. అయితే దర్శకుడు దాన్ని అలవోకగా సాధించేసాడు. సినిమా ప్రారంభమైన కాసేపటికి మనం ఓ కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టి అనిపిస్తుంది. తెలియకుండానే మనం కూడా ఆ అడవి దున్న వేటలో భాగస్వాములం అయ్యిపోతాము. ఆదిమ మానవుల నాటి పశు ప్రవృత్తి మన జీన్స్ లో ఇంకా నిద్రాణమై ఉందని, అది అవకాసం వచ్చినప్పుడు బయిటకు వస్తుందని మనకు అర్దమవుతుంది. అందుకే ఓ రాత్రి జరిగే కథగా ఈ సినిమాని చెప్పినట్లు ఉన్నాడు దర్శకుడు. అలాగే కొంత కాల వ్యవధిలో జరిగే ఈ కథను తీర్చి దిద్దే ప్రయత్నం చేయటంలో టైమ్ లాక్ పడి,ఉత్సుకత పెరిగింది. టైమ్ అండ్ టెన్షన్ ఎలిమెంట్ కు ఈ సినిమాలో ప్రయారిటీ బాగా ఇచ్చారు. అదే సినిమాని నిలబెట్టింది. 

అయితే ఈ సినిమాని ఒకే ప్లాట్ గా చెప్తే బోర్ వస్తుందనుకున్నాడో ఏమో కానీ, సబ్ ప్లాట్స్ ని కలిపారు. కానీ అవి కథలో కలిసినట్లు అనిపించవు. తెల్లారి నిశ్చితార్గం అవ్వాల్సిన  ఓ అమ్మాయి అదే రాత్రి లేచిపోయే ప్రయత్నం చేయటం, నిశ్చితార్ధపు విందులో బీఫ్ మాంసం కూర తప్పనిసరిగా ఉండి తీరాలనే ఆ తండ్రి తాపత్రయం వంటివి కథలో కలిసినట్లు అనిపించవు. అలాగే సినిమా సెకండాఫ్ లో ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఎంతసేపు జనాలు అడవి దున్న కోసం పరుగులు పెట్టడమే తప్ప..కథలో పరుగు కాదు..అడుగు కూడా పడదు. 

దర్శకుడు నేర్పరితనం, మిగతా డిపార్టమెంట్స్

ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. దర్శకుడి విజువలైజేషన్. తన సినీ నేత్రంతో సీన్స్ ఊహించి మనను అక్కడకి తీసుకెళ్లి కూర్చోబెడతాడు. ఓ రకంగా ఎట్మాస్ఫియర్ కూడా ఈ సినిమాలో ఓ పాత్ర. అలాగే డిటేలింగ్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వటంతో మన మనస్సులో ఆ సీన్స్ ముద్ర వేసుకుంటాయి. క్యారక్టర్స్ మనకు పూర్తిగా పరిచయం చేయడు. వాళ్ల చేష్టలు..వాటి నుంచి పుట్టే సంఘటనలతో మనకు అర్దమయ్యేలా చేస్తాడు. దాంతో తెలియకుండానే ఆ  పాత్రలపై మనకు ఆసక్తి పెరిగిపోతుంది. అలాంటి మ్యాజిక్ లు  ఈసినిమాలో చాలా కనపిస్తాయి. అలాగే  ఈ సినిమాని మరో భుజంపై మోసింది..బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అలాంటి రీరికార్డింగ్, ఆర్ ఆర్ మనకు అరుదుగా కనిపిస్తాయి..సారీ వినిపిస్తాయి. అంటే దర్శకుడు టెక్నికల్ స్టాడర్డ్స్ ఏ స్దాయిలో ఊహించుకోవచ్చు. ఇక మిగతా డిపార్టమెంట్స్ విషయానికి వస్తే..సినిమాలో కెమెరా వర్క్ కష్టం స్పష్టంగా కనపడుతుంది. కొన్ని షాట్స్ ఎలా తీసారో అని ఆశ్చర్యం  వేస్తుంది.

ఫైనల్ ధాట్
ఒట్టు..ఇది సినిమా చేసిన కనికట్టు..
 --సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 3

ఎవరెవరు..
  నటీనటులు : ఆంటోనీ వర్గీస్‌, చెంబన్‌ వినోద్‌ జోసే, సబుమోన్ అబ్దుసామద్, శాంతి బాలచంద్రన్ తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్: రంగనాథ్ రవీ 
నిర్మాతలు:  థామస్ పానికర్
డైరెక్టర్ : లిజో జోస్  పెల్లిస్సరీ 
రిలీజ్ డేట్ :25-09-2020
ఓటీటి:  ఆహా
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios