అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటనకే కాదు నాట్యానికి కూడా ప్రసిద్ధం. క్లాసికల్ అయినా వెస్ట్రన్ అయినా ఆమె దుమ్ముదులుపుతారు. ఇప్పటికే ఆ విషయాన్ని తన డాన్స్ వీడియోల ద్వారా నిరూపించారు. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో జాన్వీ పంచుకొనే డాన్స్ వీడియోలు చాలా పాప్యులర్ అయ్యాయి. జాన్విలోని టాలెంట్ ని చూసి ఆమె ఫ్యాన్స్ వావ్ అన్నారు. 

తాజాగా జాన్వీ మరో కొత్త డాన్స్ విధానాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఆమె నడుము కనిపించేలా డ్రెస్ ధరించి బెల్లి డాన్స్ చేశారు. అశోక మూవీలోని సనా సనన్ సాంగ్ జాన్వీ చేసిన బెల్లి డాన్స్ చాలా సెక్సీగా ఉంది. జాన్వీ నడుము మడతల సోయగాలు బెల్లి డాన్స్ లో మైమరిపించాయి. ఒరిజినల్ లో ఈ సాంగ్ కి కరీనా కపూర్ నటించగా, జాన్వీ ఆ సాంగ్ కి బెల్లీ డాన్స్ టచ్ ఇచ్చి అందరినీ ఫిదా చేశారు. 

గతంలో కూడా జాన్వీ కపూర్ అనేక డాన్స్ వీడియోలు పంచుకోవడం జరిగింది. 2018లో విడుదలైన ధఢక్ మూవీతో వెండితెరకు పరిచయమైన జాన్వీ వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ ముందుకు వెళుతున్నారు. లేడీ పైలట్ గా గుంజన్ సక్సేనా అనే బయోపిక్ లో జాన్వీ నటించడం జరిగింది. దోస్తానా 2, రూహి ఆఫ్జానా మరియు గుడ్ లక్ జెర్రీ అనే చిత్రాలు చిత్రీకరణ దశలో ఉండగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.