మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఇష్టపడి సైరా చిత్రంలో నటించారు. చిరంజీవి రాజకీయాలోకి వెళ్ళకముందు నుంచి సైరా చిత్రానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి సైరా చిత్రం తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తొలి షో నుంచే సైరా చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైంది. 

నిర్మాత రాంచరణ్ తో పాటు, దర్శకుడు సురేందర్ రెడ్డికి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.సక్సెస్ మీట్ లో జగపతి బాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాన్నకు ప్రేమతో అంటే సైరా చిత్రాన్నే ఉదాహరణగా చెప్పొచ్చు. రాంచరణ్ తన తండ్రికి ఇచ్చిన మంచి గిఫ్ట్ ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి రిటర్న్ గిఫ్ట్ అదిరిపోయింది. 

ఇంత భారీ బడ్జెట్ లో సినిమా నిర్మించినప్పుడు తప్పకుండా టెన్షన్ ఉంటుంది. ఈ సమయంలో ఇలాంటివి చెప్పొచ్చో లేదో తెలియదు. కానీ చెప్పేస్తా. సైరాలో నటించిన కొందరు వ్యక్తులే రాంచరణ్ పై జోకులు వేశారు. రాంచరణ్ సైరా కోసం చాలా కాస్ట్లీ జూనియర్ ఆర్టిస్టులని పెట్టుకున్నాడు అని ఎగతాళి చేశారు అని జగపతి బాబు కామెంట్స్ చేశారు. 

జగపతి బాబు సైరా చిత్రంలో వీరారెడ్డి పాత్రలో నటించారు. తెలుగు రాష్ట్రాల్లో సైరా చిత్రం తొలిరోజు 37 కోట్ల షేర్ రాబట్టింది. దసరా సెలవులు కాబట్టి సైరా చిత్రానికి రానున్న రోజుల్లో మంచి వసూళ్లు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.