Asianet News TeluguAsianet News Telugu

ఏ మాత్రం ఆకట్టుకోని ‘మిసెస్ సీరియల్ కిల్లర్’!

లాక్ డౌన్ లో ఎలాగో థియోటర్ కు వెళ్లి సినిమా చూసే పరిస్దితి లేదు. ఆ లోటు తీర్చడానికి నెట్ ప్లిక్స్ వారు సీరియల్ కిల్లర్ కాన్సెప్టు తో తమ ఒరిజినల్ ఫిల్మ్ లాంటి చూపిస్తానంటే కాదనేదేముంది. అందులోనూ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే మనోజ్ బాజ్ పాయి, అందగత్తె జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కాంబినేషన్ అంటే వదిలిపెట్టబుద్ది కాదు. ట్రైలర్ తో ఎక్సపెక్టేషన్స్ పెంచిన ఈ వెబ్ ఫిల్మ్ ...మన అంచనాలను రీచ్ అవుతుందా...సీరియల్ కిల్లర్ భయపెడుతుందా...అసలు ఈ  ‘మిసెస్ సీరియల్ కిల్లర్’ వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి చూద్దాం.

Jacqueline Fernandez- Manoj Bajpayee Mrs Serial Killer movie review
Author
Hyderabad, First Published May 5, 2020, 5:49 PM IST

లాక్ డౌన్ లో ఎలాగో థియోటర్ కు వెళ్లి సినిమా చూసే పరిస్దితి లేదు. ఆ లోటు తీర్చడానికి నెట్ ప్లిక్స్ వారు సీరియల్ కిల్లర్ కాన్సెప్టు తో తమ ఒరిజినల్ ఫిల్మ్ లాంటి చూపిస్తానంటే కాదనేదేముంది. అందులోనూ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే మనోజ్ బాజ్ పాయి, అందగత్తె జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కాంబినేషన్ అంటే వదిలిపెట్టబుద్ది కాదు. ట్రైలర్ తో ఎక్సపెక్టేషన్స్ పెంచిన ఈ వెబ్ ఫిల్మ్ ... మన అంచనాలను రీచ్ అవుతుందా.. సీరియల్ కిల్లర్ భయపెడుతుందా... అసలు ఈ ‘మిసెస్ సీరియల్ కిల్లర్’ వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి చూద్దాం.
 
కథ ఏంటి :
ఉత్తరాఖండ్ లో ఓ ఫేమస్ గైనకాలజిస్ట్ మృత్యుంజయ ముఖర్జీ (మనోజ్ బాజ్‌పాయ్). షోనా (జాక్వెలిన్ ఫెర్నాండెజ్) అతని ప్రియమైన భార్య. అతను అవుటాఫ్ సిటీ కు వెళ్లినప్పుడు ఓ సంఘటన జరుగుతుంది. సిటీలో జరుగుతున్న వరస సీరియల్ కిల్లింగ్ హత్యలకు కారణం  మృత్యుంజయ అని, అతనే కిల్లర్ అని ప్రూవ్ అవుతుంది. పెళ్లి కాకుండా గర్బవతులైన వాళ్ల నుండి పిండం వేరు చేసి, వాళ్లను పాశవికంగా చంపేస్తున్నాడని అతనిపై ఆరోపణ. తన అమాయికమైన భర్త అలాంటివి చేస్తాడంటే ఆ భార్య నమ్మలేకపోతుంది. అతన్ని పోలీస్ లు నిర్దాక్ష్యణంగా తీసుకెళ్లి జైల్లో వేసేసారు. సమాజం మొత్తం వేలేసినట్లుగా బిహేవ్ చేస్తోంది. జైల్లో ఉన్న అతనిపై తోటి ఖైదీలు దాడి చేస్తున్నారు. తమను ఓ పాపాత్ములు అన్నట్లుగా అందరూ చూస్తూ దూరం పెడుతున్నారు. చివరకు ఇంట్లో పనిమనిషి సైతం ..ఛీ కొట్టి వెళ్లిపోయింది. అయితే ఆమె అనుమానం అంతా తన మాజీ బోయ్ ప్రెండ్ పోలీస్ అధికారి ఇమ్రాన్ (మోహిత్ రైనా)పై ఉంది. అతనే తను దక్కలేదని కోపంతో ఈ పని చేసాడని భావిస్తుంది. ఏ దారి లేని సమయంలో ఆ కేసు నుంచి తన భర్తను తప్పించటానికి,అతనిపై సానుభూతి ఉన్న  ఓ పెద్ద లాయిర్ ని సలహా అడుగుతుంది. 

అప్పుడాయన... ఒకటే చెప్తాడు. మీ ఆయన జైల్లో ఉండగా... మరో ప్రెగ్నెంట్ అమ్మాయి మర్డర్ జరిగితే ... అప్పుడు ఆ సీరియల్ కిల్లర్ , మీ ఆయన ఒకరు కారు అని ప్రూవ్ అవుతుందని.. బయటకు తీసుకురావచ్చు అని అంటాడు.  కానీ ఇప్పటికిప్పుడు హఠాత్తుగా ఎక్కడ అలాంటి సీరియల్ కిల్లర్ మర్డర్ ఎక్కడ జరుగుతుంది. ఆ సీరియల్ కిల్లర్ సైలెంట్ గా ఉండిపోతే... తన భర్త అనువసరంగా శిక్షకు గురి అవుతాడు. ఏం చేయాలి..అనే ఆలోచనలోంచి... తనే ఆ సీరియల్ కిల్లర్ గా మారి ఓ మర్డర్ చేస్తే సరిపోతుంది  అనే నిర్ణయానికి వస్తుంది.  అందుకు పెళ్లికాకుండా గర్బవతి అయిన ఓ అమ్మాయిని ఎంచుకుంటుంది. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తన భర్త హాస్పటిల్ కు తీసుకు వస్తుంది. అక్కడ నుంచి ఏం జరిగింది. ఆ తీసుకు వచ్చిన అమ్మాయిని హత్య చేయగలిగిందా.. తన భర్తను రక్షించుకుందా.. అసలు సీరియల్ కిల్లర్ ఎవరు.. వంటి విషయాలతో మిగతా సినిమా నడుస్తుంది.
   
ఎలా ఉంది:
తన భర్తను బయిటకు తేవటానికి తనే సీరియల్ కిల్లర్ అవ్వాలనుకోవటం దాకా బాగుంది. అయితే ఆ తర్వాతే జరిగే సీన్స్ ఆసక్తిగా ఉండవు. ఎందుకంటే సీరియల్ కిల్లర్ గా మారాలనుకున్న తర్వాత అందుకు తగ్గ సంఘటనలు లో కాన్‌ఫ్లిక్ట్‌ ఉండదు. అంతా ఆమె అనుకున్నట్లుగా వన్ సైడ్ గా జరిగిపోతుంది. అలా కాకుండా సీరియల్ కిల్లర్ గా తాను అయ్యి... ఒకరిని మర్డర్ చేయాలనుకున్నప్పుడు ఊహించనది ఏదైనా సంఘటన జరిగి ఇరుక్కుపోతే అప్పుడు క్యారక్టర్ ఆర్క్ జస్టిఫై అయ్యేది. అలా చేయకపోవటంతో విపరీతమైన బోర్ కొట్టేసింది. సినిమా పూర్తైనా ఏమీ చూసినట్లు అనిపించదు. ఎందుకంటే కథలో ఆ మలుపు తప్ప చెప్పుకోదగ్గవి ఏమీ ఉండవు. 

అప్పట్లో భానుప్రియతో జంధ్యాల గారు రూపొందించిన ష్.. గప్ చిప్ సినిమాలోనూ దాదాపు ఇలాంటి పాయింట్  ఉండి ఆసక్తి రేపుతుంది. ష్ .. గప్ చిప్ లో బ్యాంక్ లో క్యాషియర్ గా  పనిచేసే భానుప్రియ దగ్గర నుంచి ఆమె తండ్రి (సుత్తివేలు) డబ్బు ఎత్తుకుపోతాడు. ఆ డబ్బు ఇప్పుడికిప్పుడు తిరిగి అక్కడ పెట్టే పరిస్దితి లేదు. దాంతో ఆ విషయం బయిటపడకుండా ఉండాలంటే... బ్యాంక్ లో దొంగతనం జరగి.. అందులో భాగంగా ఆ యాభైవేలు కూడా పోయాయని చెప్పాలి.... అందుకు భానుప్రియ స్వయంగా ఓ దొంగని మాట్లాడి తన క్యాబిన్ లో దొంగతనం చేయమంటుంది. తను సహకరిస్తానంటుంది.అప్పుడు జరిగే ప్లే ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫన్ తో దాన్ని డీల్ చేయటం కలిసొచ్చింది. ఇక్కడ సీరియస్ నెస్ తో కూడిన పాసివ్ క్యారక్టరైజేషన్ సినిమాని దిగజార్చేసింది. 

దర్శకత్వం, మిగతా విభాగాలు:
ఇంక ఈ సినిమాలో టెక్నికల్ విలువలు మాట్లాడటం అంటే...రాళ్లలో బియ్యం ఏరటం లాంటిదే. అన్ని విభాగాలు అత్యంత నీరసంగా సాగుతాయి. గతంలో జోకర్, జాన్-ఇ-మన్ వంటి హిందీ చిత్రాలను నిర్మించిన శిరీష్ కుందర్ ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వ ప్రతిభ.. ఎంతలా ఉంటుందంటే ఈ పేరు గుర్తు పెట్టుకుని భవిష్యత్ లో ఎప్పుడూ ఆయన చేసిన సినిమాలు చూడకూడదని డిసైడ్ అవుతాము. నిర్మాణ విలువలు అయితే మన తెలుగులో వచ్చే శాటిలైట్ సినిమాని గుర్తు చేస్తాయి. ఉన్నంతలో కాస్టలీ .. జాక్విలిన్, మనోజ్ బాజపేయి మాత్రమే. ది ప్యామిలీ మెన్ వెబ్ సీరిస్ లో దుమ్ము రేపిన మనోజ్ బాజపేయి కు చేయటానికి ఏమీ లేదు. జాక్విలిన్ ని అయితే అసలు గ్లామర్ పరంగానూ, నటనపరంగానూ ఏమీ వాడుకోలేదు. 

ఫైనల్ ధాట్

ఈ సీరియల్ కిల్లర్ ని చూడటం కన్నా టీవిలో వచ్చే 'సీఐడీ' సీరియల్ చూడటం  మిన్న.

Rating:1.5

Follow Us:
Download App:
  • android
  • ios