Asianet News TeluguAsianet News Telugu

ఆ కామెంట్స్ పై 'జబర్దస్త్' రష్మీ ఫైర్

లాక్ డౌన్ లో బిచ్చగాళ్ల సమస్యలపై కొందరు నెట్ జన్లు చేస్తున్న కామెంట్స్ పై రష్మీ గౌతమ్‌ మండిపడింది. కరోనా నేపథ్యంలో కొందరు బిచ్చగాళ్లు సమస్యలు తీసుకొస్తున్నారంటూ ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యపై జబర్దస్‌ యాంకర్‌ ఫైర్ అయ్యింది.

Jabardasth host Rashmi Gautam hits back at a netizen
Author
Hyderabad, First Published Mar 27, 2020, 2:36 PM IST

సోషల్ మీడియాలో జబర్దస్త్ రేష్మీ ఎప్పుడూ కాస్తంత ఎగ్రిసివ్ గానే ఉంటుంది. రకరకాల సమస్యలు,విషయాలపై ఆమె స్పందిస్తూంటుంది. అంతేకాక తనను ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే వారిని పీకి పాకం పెడుతూంటుంది. తాజాగా ఆమె కరోనా వ్యాధి నివాణకు చేస్తున్న లాక్ డౌన్ లో బిచ్చగాళ్ల సమస్యలపై కొందరు నెట్ జన్లు చేస్తున్న కామెంట్స్ పై ఆమె మండిపడింది. 
కరోనా నేపథ్యంలో కొందరు బిచ్చగాళ్లు సమస్యలు తీసుకొస్తున్నారంటూ ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యపై జబర్దస్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌ ఫైర్ అయ్యింది.

 తాజాగా రష్మి లైవ్‌లో మాట్లాడితూ... 'అన్ని దుకాణాలు బంద్ ఉన్నాయి. పేదలకు ఫుడ్‌ దొరకట్లేదు. కొందరికి చెత్త ఏరుకోవడం తప్ప మరో ఆప్షన్‌ లేదు. దాని వల్లే వారు బతుకుతున్నారు. మీరు తినేటప్పుడు ఒక్క చపాతి అయినా వారికి ఇస్తే, కొంచం అన్నం పెడితే వారి ఆకలి తీరుతుంది. వారు ఆకలితో ఉంటున్నారు. అన్ని టిఫిన్‌ సెంటర్లు కూడా బంద్‌ అయ్యాయి. మనం ఇంట్లో మూడు పూటలు తింటున్నాం. పేదవారు మాత్రం తినట్లేదు.. ప్లీజ్‌ ప్లీజ్‌ ప్లీజ్‌ వారికి కాస్త ఆహారం అందిద్దాం' అని పిలుపునిచ్చింది.

అలాగే 'చపాతి, రైస్‌.. కనీసం బిస్కెట్లయినా సరే వారికి ఇస్తే వారు తింటారు. కనీసం మీ గేటు వద్దయినా కాస్త ఆహారం పెట్టండి. వారు వచ్చి తీసుకుని తింటారు' అని తెలిపింది.

 అయినప్పటికీ నెటిజన్లు పలు రకాలుగా దీనిపై వ్యాఖ్యలు చేయడంతో స్వార్థపూరితంగా ఉండకూడదని చెప్పింది. 'అన్నీ మనమే తినేయాలి. అన్నీ మనమే కొనుక్కుని పెట్టుకోవాలి అనుకుంటే కష్టం' అని ఆమె తెలిపింది. 'ఇప్పుడు కూడా నేర్చుకోకపోతే.. మరెప్పుడు నేర్చుకుంటారో' అని రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios