Asianet News TeluguAsianet News Telugu

గోలెత్తిపోతున్న గెటప్ శ్రీను.. వాళ్లపై పోలీస్ కంప్లైంట్


తనదైన శైలి కామెడీతో.. విభిన్నమైన గెటప్స్‌లో అందరినీ అలరిస్తూ బుల్లితెర కమల్ హసన్ లా చెలరేగిపోతున్నాడు గెటప్ శ్రీను. ఆ కీర్తిని ఎంజాయ్ చేస్తున్న సమయంలో కొందరు అతని పేరు మీద ఫేక్ ఎక్కౌంట్స్ తయారు చేసి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్ట్ లు పెడుతున్నారు. 

Jabardasth Getup Srinu to file complaint at Cybercrime police
Author
Hyderabad, First Published Apr 7, 2020, 4:35 PM IST

తమ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు సెలబ్రెటీలు పేరు, కీర్తీ అనుభవిస్తారు. అదే సమయంలో కొన్ని చేదు సంఘటనలు, చిరాకు పెట్టే విషయాలు కూడా వీళ్ల జీవితాల్లోకి తొంగి చూస్తాయి. కొందరు వీరి పేరుని వాడుకోవటానికి,మరికొందరు డీ గ్రేడ్ చేయటానికి ప్రయత్నిస్తూంటారు. జబర్దస్త్ తో పాపులర్ అయిన గెటప్ శ్రీను లైఫ్ లో కూడా అదే జరుగుతోంది. ఈ రోజున గెటప్ శ్రీను అంటే తెలియని తెలుగువాడు లేడు అన్నంత పాపులారిటీ వచ్చింది.  

తనదైన శైలి కామెడీతో.. విభిన్నమైన గెటప్స్‌లో అందరినీ అలరిస్తూ బుల్లితెర కమల్ హసన్ లా చెలరేగిపోతున్నాడు గెటప్ శ్రీను. ఆ కీర్తిని ఎంజాయ్ చేస్తున్న సమయంలో కొందరు అతని పేరు మీద ఫేక్ ఎక్కౌంట్స్ తయారు చేసి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్ట్ లు పెడుతున్నారు.  సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న ఫేక్ అకౌంట్లపై గెటప్ శ్రీనుకు బాగా కోపం వచ్చింది. తన పేరుతో ఎవరో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి యాంటీ పోస్టులు పెడుతున్నారని.. వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని ఈ జబర్దస్త్ కమెడియన్ లైవ్ వీడియోలో చెప్పాడు.

రీసెంట్ గా  ఓ వీడియో చేసిన శ్రీను.. తనకు సోషల్ మీడియాలో ఉన్నది కేవలం రెండు అకౌంట్లు మాత్రమేనని.. అందులో ఒకటి పర్సనల్ అయితే.. మరొకటి పేక్ అని తెలియచేసాడు. ఈ రెండు కాకుండా ఎవరో గెటప్ శ్రీను పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతున్నారని చెప్పాడు. దానితో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. కాగా, ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios