Asianet News Telugu

తెలంగాణ భాషని, సంస్కృతిని కించపరచలేదు.. హైపర్ ఆది వివరణ

 హైపర్‌ ఆది స్పందించాడు. దీనిపై ఆయన వివరణ ఇచ్చాడు. తాను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరచలేదని తెలిపాడు. స్క్రిప్ట్ నేను రాయలేదు. నేను కేవలం ఆర్టిస్టుని మాత్రమే అని తెలిపారు. 
 

jabardasth fame hyper aadi react on police complaint arj
Author
Hyderabad, First Published Jun 15, 2021, 3:21 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఓ టీవీ షోలో తెలంగాణ భాషని, బతుకమ్మ పండుగని, గౌరమ్మని హైపర్‌ ఆది కించపరిచాడంటూ కేసు నమోదైన విషయం తెలిసిందే. సోమవారం తెలంగాణ జాగృతి స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సభ్యులు ఎల్బీనగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా హైపర్‌ ఆది స్పందించాడు. దీనిపై ఆయన వివరణ ఇచ్చాడు. తాను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరచలేదని తెలిపాడు. స్క్రిప్ట్ నేను రాయలేదు. నేను కేవలం ఆర్టిస్టుని మాత్రమే అని తెలిపారు. `బహుశ ఎడిటింగ్ తప్పిదం వల్ల పొరపాటు జరిగి ఉండవచ్చు.. నేను తెలంగాణ ప్రజలక్షమాపణకు సిద్ధం గా ఉన్నాన`ని చెప్పారు హైపర్ ఆది.

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ టీవీలోని కామెడీ ప్రోగ్రామ్‌లో ఆది.. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మతో పాటు తెలంగాణ యాస,  భాషలను కించపరిచేలా స్కిట్‌ ప్రదర్శించాడని తెలంగాణ జాగృతి స్టూడెంట్‌ ఫెడరేషన్‌ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు వాళ్లు ఆదిపై, స్క్రిప్ట్ రైటర్‌, ఆ షో నిర్వహకులు మల్లెమాల ప్రొడక్షన్‌పై చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆది స్పందించారు. 

హైపర్‌ ఆది పంచ్‌లతో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. `జబర్దస్త్`లో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. దీంతోపాటు `ఢీ` డాన్స్ లో, అలాగే `శ్రీదేవి డ్రామా కంపెనీలో సుడిగాలి సుధీర్‌తో కలిసి స్కిట్‌ చేస్తూ నవ్వులు పూయిస్తున్నాడు. టీవీలో అత్యంత క్రేజ్‌ ఉన్న హాస్యనటుల్లో ఆది ఒకరనే విషయం తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios