దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. చాలా కాలం తరువాత ఈ సినిమాతో పూరి మాసివ్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. 

రీసెంట్ గా సినిమా కారణంగా వచ్చిన ప్రాఫిట్స్ తో లగ్జరీ కార్లు కూడా కొన్నాడు పూరి. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలను బాలీవుడ్ లో బాగానే రీమేక్ చేస్తున్నారు. 

తెలుగు సినిమాలకు క్రేజ్ పెరగడంతో నార్త్ వారి చూపు కూడా ఇటువైపు పడింది. ఇక్కడ హిట్ అయిన సినిమాలను తమ దగ్గర రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో 'ఇస్మార్ట్ శంకర్'ని బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్ధమవుతోంది.

ఇప్పటికే రీమేక్ రైట్స్ కూడా సొంతం చేసుకున్న ఈ సంస్థ త్వరలోనే నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటించే ఛాన్స్ ఉందన్నట్లుగా సమాచారం. 

అయితే బాలీవుడ్ లో ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. తెలుగులో అయితే పూరి ఈ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నట్లు చెప్పాడు.