హాట్ యాంకర్ అనసూయ దివంగత నటి సిల్క్ స్మిత బయోపిక్ చేస్తున్నారంటూ కథనాలు రావడం జరిగింది. దీనిపై ఇంత వరకు అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ దాదాపు పట్టాలెక్కనుందని అంటున్నారు. తాజాగా అనసూయ షూటింగ్ సెట్స్ లో ఉన్న... ఓ స్టిల్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉన్న సెక్సీ డ్రెస్ లో మేకప్ వేసుకొని, కుర్చీలో కూర్చొని ఉన్నారు. వెనుక నుండి అనసూయ ఫోటో కాప్చర్ చేయడం జరిగింది. 
 
ఆ ఫోటో చూసిన చాలా మంది ఇది సిల్క్ స్మిత పాత్ర కోసం అనసూయ లుక్ అంటున్నారు. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. తెలుగు అమ్మాయి అయిన సిల్క్ స్మిత ఎటువంటి ఆధారంగా లేకుండానే స్వశక్తితో పరిశ్రమలో శృంగార తారగా ఎదిగారు. ఐటెం గర్ల్ గా, శృంగార తారగా వందల చిత్రాలలో సిల్క్ స్మిత నటించారు. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన సిల్క్ స్మిత 1996లో ఆత్మహత్య చేసుకొని మరణించారు. 
 
ఇప్పటికే హిందీలో డర్టీ పిక్చర్ పేరుతో సిల్క్ స్మిత బయోగ్రఫీ వెండితెరపైకి రావడం జరిగింది. విద్యాబాలన్ సిల్క్ స్మిత రోల్ చేయగా, భారీ విజయాన్ని అందుకుంది. ఆ మూవీతో విద్యా బాలన్ స్టార్ డమ్ మారిపోయింది. ఇక యాంకర్ గా, నటిగా అనసూయ దూసుకుపోతున్నారు. కృష్ణ వంశీ దర్శకత్వంలో రంగమార్తాండ మూవీ చేస్తున్న అనసూయ, థాంక్ యూ బ్రదర్ అనే మరో మూవీ చేస్తున్నారు.