అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ‘అల వైకుంఠపురములో ’ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేస్తున్న‌ారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అక్కినేని మేన‌ల్లుడు, హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ హీరో వేసే పాత్ర ఏమిటన్నది సస్పెన్స్ గా మారింది. సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఈ సినిమాలో సుశాంత్ పాత్ర డిఫరెంట్ గా ఉంటుందని అల్లు అర్జున్ కు కి సోదరుడిగా నటిస్తున్నాడని కొందరంటే.. లేదు పూజా హెగ్డేకు అన్నయ్యగా కనిపిస్తాడని ఇంకొందరు అంటున్నారు. ఆ విషయం వైరల్ గా మారిపోయింది.

సుశాంత్ పాత్రపై ఎవ‌రికి వారు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడేసుకోవటం ఆయన్ని చేరింది. దాంతో ఈ సినిమాలో త‌న పాత్రపై సుశాంత్ స్పందించాడు. తాను బన్నీకి బ్రదర్‌ని కాదు.. అదృష్టవశాత్తు పూజా హెగ్డేకు కూడా అన్నయ్యను కాదు. అసలు నా పాత్ర ఏమిటో తెలుసుకోవాలంటే కాస్త వెయిట్ చేయండి అని ట్వీట్ ట్విస్ట్ ఇచ్చాడు. దాంతో సస్పెన్స్ మళ్లీ మొదటికొచ్చినట్లైంది.

హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో  టబు, జయరామ్, నివేత పేతురాజ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్.థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు.  రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రమోషనల్ సాంగ్ ‘సామజవరగమన’ మంచి హిట్టైంది.  మరో ప్రక్క ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా భారీ ఎత్తున జ‌రుగుతోంది. ఓవ‌ర్సీస్ హ‌క్కులు రు.8.5 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయని తెలుస్తోంది.