అందరూ హీరోలు తమ సినిమాలో రష్మిక ఉంటే హిట్ రిలీజ్ కు ముందే వచ్చిందని సంబరపడతారు. అంతలా క్రేజ్ తెచ్చుకుంది  రష్మిక మందన . ఈ కన్నడ పిల్ల ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగుతోంది. సమంత ప్లేస్ లోకి ఆమె వచ్చేసింది. పూజ హెగ్డే ని కూడా దాటేస్తోంది. అలాంటి రష్మికను తమ సినిమాలో హీరోయిన్ గా తీసుకుందామంటే వద్దనే హీరోలు ఉంటారా..అంటే ఉన్నారనే అంటోంది ఓ వర్గం మీడియా. 

రష్మికను తమ సినిమాలో తీసుకుందామంటే మహేష్ బాబు వద్దన్నాడంటూ ఓ వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. రీసెంట్ సరిలేరు నీకెవ్వరూ సినిమాలో చేసి,హిట్ కొట్టిన ఈ కాంబో మళ్లీ రిపీట్ అంటే ప్రేక్షకుల సంగతి ఎలా ఉన్నా..డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడి సినిమాని కొంటారు. అయితే తన సినిమాలో రొటీన్ గా ఒకే హీరోయిన్..అదీ వెంటనే చేస్తే బాగుండదని మహేష్ అభిప్రాయ పడుతున్నారట. ఈ మాటే తన దర్శకుడు పరుశరామ్ కు చెప్పారని చెప్పుకుంటున్నారు.

తన సూపర్ హిట్ గీతా గోవిందంలో రష్మిక వాటా పెద్దది అని పరుశరామ్ కు తెలుసు. అందుకే మహేష్ ని కన్వీన్స్ చేద్దామనే పనిలో ఉన్నారట. ఆ పాత్ర ఆమెనే దృష్టిలో పెట్టుకుని రాసానని అంటున్నారట. కాబట్టి కొత్త సినిమాలో కూడా రష్మికనే తీసుకుంటూ బావుంటుందని పరుశరామ్ మహేష్‌తో అన్నట్లు చెప్తున్నారు. కానీ మహేష్ మాత్రం ..చూడండి వేరే వాళ్లు ఎవరూ సెట్ కాకపోతే లాస్ట్ ఆఫ్షన్ గా ఆమెను తీసుకుందామని అన్నారని అంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజముందనేది తెలియాల్సి ఉంది.