ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' చిత్రం రూపొందుతోంది. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. పీరియాడికల్‌ లవ్‌స్టోరిగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజా మ్యూజిక్‌ టీచర్‌గా కనిపిస్తుందని వార్తలు వినిపించాయి. కాగా.. తాజా సమాచారం మేరకు పూజ పాత్రకు సంబంధించి మరో వార్త హల్‌చల్‌ చేస్తోంది. 

ఈ చిత్రంలో ఆమె  ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు చెబుతున్నారు. సాధారణంగా డబుల్ రోల్స్ చేసే అవకాశం హీరోలకు వస్తుంటుంది కానీ హీరోయిన్ లకు మాత్రం చాలా అరుదుగా వస్తుంది. అలాంటి అరుదైన అవకాశం ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ  హీరోయిన్ గా రాణిస్తున్న పూజ హెగ్డేకు వచ్చినట్టు చెప్తున్నారు.

అలాగే పూజ  లుక్‌ ట్రెడిషనల్‌ క్లాసిక్‌గా ఉంటుందని  అంటున్నారు. ఇక ఈ కవలలు ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు ప్రభాస్ ని ప్రేమిస్తారని...చివరకు ఒకరు త్యాగం చేస్తారని చెప్తున్నారు. అయితే ఇది పులిహార వార్త అని,ప్రబాస్ సినిమాలో ఇలాంటి ట్విస్ట్ ఏమిటి  కొందరు అంటున్నారు.   

ఇక ఈ చిత్రం ప్రోగ్రెస్ విషయానికి వస్తే, లాక్ డౌన్ కి ముందు కొంత భాగం షూటింగ్ జార్జియాలో నిర్వహించారు. కథ ప్రకారం మళ్లీ యూరప్ వెళ్లాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కష్టం కాబట్టి, ఆ షూటింగును కూడా హైదరాబాదులోనే సెట్స్ లో చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.