కరోనా వచ్చాక ఈ రోజు ఉన్న పరిస్దితులు రేపు ఉండటం లేదు. చాలా రంగాలు ఇప్పటికే కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నాయి. సినీ పరిశ్రమ కూడా అందుకు మినహాయింపు లేదు. భారీ బడ్జెట్ సినిమాలుకు కరోనా సెగ డైరక్ట్ గా తగులుతోంది. యాభై కోట్లు, వంద కోట్లు అని నీళ్లలా డబ్బు పోసేస్తే తిరిగి ఆ డబ్బు అదే స్దాయిలో రికవరీ ఉంటుందా అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. దాంతో పైనాన్సియర్స్ కూడా గతంలో లాగ ఉత్సాహంగా ముందుకు రావటం లేదని వినికిడి. ఈ సిట్యువేషన్ లో బాలయ్య, బోయపాటి సినిమా నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డి కూడా ఉన్నారని ఇండస్ట్రీలోనూ, మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. దాదాపు యాభై కోట్ల దాకా బడ్జెట్ అయ్యే ఈ చిత్రం నుంచి ఆయన తప్పుకున్నాడని అంటున్నారు. 

ఈ క్రేజీ ప్రాజెక్టు కు ఫైనాన్స్ ఇబ్బందులు తలెత్తాయని,దాంతో విషయం బాలయ్యకు చెప్పారని అంటున్నారు. దాంతో తన ఎన్ బీ కే బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించటానికి బాలయ్య ముందుకు వస్తున్నాడని అంటున్నారు. ఈ మేరకు బడ్జెట్ కోతలు కూడా చేయమని బోయపాటి కు పురమాయించారట. బోయపాటి తీసిన వినయ విధేయ రామ చిత్రం డిజాస్టర్ అవటం, బాలయ్య వరస ప్లాప్ ల్లో ఉండట, కరోనా ప్రభావంతో ఈ సినిమాకు బిజినెస్ ఏ మేరకు జరుగుతుందనేది అంచనా వేయటం కష్టంగానే ఉంది. ఇప్పటికి థియోటర్స్ ఓపెన్ కాలేదు. ఓపెన్ అయినా జనం గతంలో లాగ ఎగబడి వస్తారనే నమ్మకం లేదు. ఈ క్రమంలో ఫైనాన్సియల్ గా అన్ని జాగ్రత్తలు తీసుకుని రంగంలోకి దిగితేనే సేఫ్ అని బాలయ్య భావిస్తున్నారట. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. 
  
 ఈ చిత్రంలో కొన్ని నిమిషాల వ్యవధిలో జన్మించిన కవల సోదరులుగా ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారని బోయపాటి చెప్పారు. ఈ మూవీలో ఇప్పటివరకు బాలయ్య ఎప్పుడూ కనిపించని పాత్రలో నటించబోతున్నారు. ఇందులో బాలయ్య లుక్ చాలా విభిన్నంగా ఉంటుంది. అంతేకాదు చాలా సర్‌ప్రైజ్‌లు కూడా ఉన్నాయి. వాటన్నింటిని నేను ఇప్పుడు రివీల్ చేయను. సినిమా చూసిన తరువాత మీకే తెలుస్తుంది అని బోయపాటి చెప్పారు.  మిర్యాలగూడ రవీంద్రరెడ్డి నిర్మిస్తోన్న ఈ మూవీలో హీరోయిన్‌గా కొత్త భామను టాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నారు.