తెలుగు వెండితెర మీద సావిత్రి తరువాత అదే స్థాయి ఇమేజ్‌ సొంతం చేసుకున్న నటి సౌందర్య. తెలుగు తో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించిన ఈ అందాల నటి అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. హీరోయిన్‌గా కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలోనే రాజకీయ పార్టీకి ప్రచారం చేసేందుకు వెళుతూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది.

ఆమె మరణంతో ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. పెళ్లికి కేవలం ఏడాది ముందు రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది సౌందర్య. దీంతో ఆమె మరణంతో కుటుంబంలో ఆస్తి వివాదాలు తలెత్తాయి. సౌందర్య పుట్టింటివారు, అత్తింటి వారు ఆస్తుల కోసం కొట్టుకున్నారు. కోర్టు మెట్లు ఎక్కారు. కొద్ది రోజులకే కోర్టు బయట రాజీచేసుకొని ఆస్తులను పంచుకున్నారు. అయితే పెళ్లి అయిన వెంటనే సౌందర్య చాలా వరకు ఆస్తులను భర్త పేరు మీదకు మార్చేసింది.

సౌందర్య ఆస్తిలో ఎక్కువగా భాగం ఆయనకే వెళ్లింది. కోట్ ఆస్తిని తీసుకున్న రఘు, తరువాత అపూర్వ అనే అమ్మాయిన పెళ్లిచేసుకొని గోవాలో సెటిల్ అయ్యాడు. అయితే చనిపోయే వరకు సౌందర్య ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. ఆ కార్యక్రమాలను మరింతగా విస్తరించాలని ఆమె కోరుకుంది. కానీ ఆమె ఆస్తులను పంచుకున్న వారెవరు ఆమె ఆశయాలను మాత్రం పంచుకోలేదు.