Asianet News TeluguAsianet News Telugu

సైన్స్...ఇది ప్రభాస్ కామన్ సెన్స్

మహానటి సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న అశ్వనీదత్ అల్లుడు, దర్శకుడు నాగ్  అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటివరకూ అందుతున్న వార్తలను బట్టి ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కనుంది అని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా మీడియా వర్గాల్లో ఓ ప్రచారం మొదలైంది. ఈ సినిమా కథ సైన్స్.. దేవుడు అనే అంశాల చుట్టూ తిరుగుతుందని, సైన్స్ ని దైవత్వ కోణంలోంచి చర్చిస్తారని, ఆధ్యాత్మకతకు ఈ సినిమాలో చోటు ఉందని అంటున్నారు.

Interesting Subject of Prabhas,naga aswin movie
Author
Hyderabad, First Published Jun 4, 2020, 1:19 PM IST

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అశ్వినీ దత్ ప్రతిష్టాత్మకంగా తన వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. మహానటి సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న అశ్వనీదత్ అల్లుడు, దర్శకుడు నాగ్  అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటివరకూ అందుతున్న వార్తలను బట్టి ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కనుంది అని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా మీడియా వర్గాల్లో ఓ ప్రచారం మొదలైంది. ఈ సినిమా కథ సైన్స్.. దేవుడు అనే అంశాల చుట్టూ తిరుగుతుందని, సైన్స్ ని దైవత్వ కోణంలోంచి చర్చిస్తారని, ఆధ్యాత్మకతకు ఈ సినిమాలో చోటు ఉందని అంటున్నారు.

 ఎవరే సుబ్రమణ్యం ఛాయిలు సైతం ఈ సినిమాలో కనపడే అవకాసం ఉందని చెప్తున్నారు.  కానీ వార్తలో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియదు కానీ ప్రభాస్ సైన్స్, దైవం కన్నా కామన్ సెన్స్ కు ఎక్కువ విలువ ఇచ్చే వ్యక్తిగా అయితే కనపడతారంటున్నారు. గుడ్డిగా ఏదీ నమ్మకూడదని, అలాగని కళ్లకు కనపడలేదు కదా అని నమ్మకుండా ఉండకూడదని ఈ కాన్సెప్టు ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. అదే కోర్ పాయింట్ అంటున్నారు. అయితే ఈ సినిమాను పూర్తి ఎంటర్ట్నైమెంట్ తో పాన్ వరల్డ్ సినిమాగా తీస్తామని తేలియాజేశారు నాగ్ అశ్విన్. 

 ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ స్పీడ్ చేసారు.అలాగే ఇప్పటికే నాగ్ అశ్విన్‌ స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేసి లాక్ చేసాడట. అంతవరకూ బాగానే ఉంది కానీ ఈ సినిమా ఇప్పుడున్న పరిస్దితుల్లో ఎప్పుడు ప్రారంభమవుతుంది...ఎప్పుడు పూర్తవుతుంది అనేది పెద్ద క్వచ్చిన్ మార్క్ గా అభిమానుల్లో మిగిలింది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి రోజూ వారీ చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయం గమనించిన అశ్వినీద్...వివరణ ఇవ్వటానికి పూనుకున్నారు.

 నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ.. నిజానికి ప్రభాస్‌ను హీరోగా మా సంస్థ ద్వారా పరిచయం చేయాలనుకున్నాము. కానీ కుదరలేదు. ఈలోగా బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ హీరో గా ఎదిగాడు. మహానటి తర్వాత నాగ్ అశ్విన్.. ప్రభాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఓ కథ రాసాడు. ఆ స్టోరీ విని నేను  ఆశ్చర్యపోయాను. ప్రభాస్ అయితేనే ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుందని నాగ్ అశ్విన్ అన్నాడు. ఆ తర్వాత ఈ కథను ప్రభాస్‌కు వినిపించడం.. ఆయన ఓకే చేయడం జరిగింది. ఈ సినిమాను ఈ యేడాది అక్టోబర్‌లో మొదలుపెట్టి.. 2022 ఏప్రిల్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నామని చెప్పుకొచ్చారాయన. 

అందుతున్న సమాచారం మేరకు నాగ్ అశ్విన్- ప్రభాస్ ప్రాజెక్టు కోసం దాదాపు 400 కోట్ల బడ్జెట్ కు రెడీ అవుతున్నారట. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం అరవింద్ స్వామి ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.  ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయట. అలాగే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కియారా అద్వానీ నటించబోతున్నట్టు సమాచారం. షూటింగ్స్ తిరిగి ప్రారంభం అయ్యాక రాధాకృష్ణ కుమార్ సినిమాను రెండు నెలల్లో ముగించి అక్టోబరులో అశ్విన్ సినిమాను మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారట ప్రభాస్.

Follow Us:
Download App:
  • android
  • ios