#SSMB29:ఇనిస్ట్రలో చూసి మహేష్ కి జోడి ఫిక్స్ చేసేస్తున్నారా?

. ఈ సినిమా జంగిల్ ఎడ్వెంచర్ గా తెరకెక్కుతోందని తెలిస్తున్న నేపధ్యంలో కథ గురించి,నటీనటుల గురించి రకరకాల విషయాలు వినపడుతున్నాయి.  

Indonesian Actress Roped in for Mahesh Babu #SSMB29?JSP

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి,  సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపొందబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం SSMB29. ఈ చిత్రం మొదలే కాలేదు కానీ రోజుకో వార్తతో మీడియాలో హంగామా జరుగుతోంది. తాజాగా చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ అనే ఇండోనేషియన్ నటి.. మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుందని సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అమెరికాలో పుట్టిన చెల్సియా.. ఇండోనేషియన్ భాషలో పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మహేశ్, రాజమౌళి మూవీలో తను కూడా ఒక కీలక పాత్రలో చెప్తన్నారు. అందుకు సాక్ష్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రాజమౌళిని చెల్సియా ఫాలో అవ్వడం చూపెడుతున్నారు. అయితే ఆమె క్యాజువల్ గా ఫాలో అయ్యిందేమో..అది చూసి మహేష్ కు జోడిగా ఆమెను ఎలా ఫిక్స్ చేసేస్తారు అని మరికొందురు అంటున్నారు. అయితే  ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోంది.లొకేషన్స్ హంటింగ్, స్టోరీ డిస్కషన్స్, కాస్టింగ్ విషయాల డిస్కషన్స్ జరుగుతున్నాయని వినికిడి.  

 ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అవ్వడంతో త్వరలోనే ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసి సినిమా విశేషాలను పంచుకోనున్నాడట రాజమౌళి. ఇక ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నారు. ఈ సినిమా జంగిల్ ఎడ్వెంచర్ గా తెరకెక్కుతోందని తెలిస్తున్న నేపధ్యంలో కథ గురించి రకరకాల విషయాలు వినపడుతున్నాయి.  మహేశ్ బాబుతో తాను తీయబోయే చిత్రం (SSMB29) అడ్వెంచర్ యాక్షన్ జానర్‌లో ఉంటుందని ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇండియానా జోన్స్ సిరీస్‍లా అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఆ మూవీ ఉంటుందని తెలిపాడు. మహేశ్‍తో తీయబోయే ఈ చిత్రం గ్లోబల్ సినిమాగా ఉంటుందని స్పష్టం చేశాడు. ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్ లాంటి ఎలాంటి హద్దులు లేని గ్లోబల్ సినిమాలను తెరకెక్కించాలనే తపన తనకు చాలా ఉందని రాజమౌళి తెలిపాడు.  

“ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్ లాంటి గ్లోబల్ సినిమాలు తీయాలని నేను ఎప్పుడూ అనుకుంటా. అడ్వెంచరస్ జానర్‌లో ప్రస్తుతం మా నాన్న ఓ సినిమా రాస్తున్నారు. స్క్రిప్ట్‌ను మేం ఇంకా ఫైనలైజ్ చేయలేదు. అయితే స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి” అని రాజమౌళి అన్నాడు. “నా తర్వాతి మూవీ మహేశ్ బాబుతో చేస్తున్నా. ఇది గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఉంటుంది. భారతీయ మూలాలతో.. ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్‍ను పోలిన మూవీగా ఉంటుంది” అని రాజమౌళి చెప్పాడు. రాజమౌళి - మహేశ్ బాబు మూవీ వర్కింగ్ టైటిల్ SSMB29గా ఉంది. ఈ చిత్రం 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios