టాలీవుడ్‌ కమ్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌ ఇలియానా గాయపడింది. షూటింగ్‌లో ఆమె గాయపడటంతో అరచేతికి గాయమైంది. ఈ ఫోటోని ఇన్‌ స్ట్రామ్‌ ద్వారా పంచుకుంది. రెండు ఫోటోలను పంచుకుంటూ `రొమాంటిక్‌ కామెడీ సినిమా కోసం షూటింగ్‌ చేస్తున్నప్పుడు ఎవరు గాయపడతారు?` అని పేర్కొంది. మరో ఫోటోని తన చేతికి గాయాన్ని చూపించింది. దీనిలో `ఐ యామ్‌ ఫైన్‌` అని పేర్కొంది. 

ప్రస్తుతం ఇలియానా `అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ` చిత్రంలో నటిస్తుంది. రణ్‌దీప్‌ హుడా హీరోగా నటిస్తున్నారు. బల్వీందర్‌ సింగ్‌ జాంజ్వ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్‌ కామెడీగా రూపొందే ఈ సినిమా షూటింగ్‌లో ఇలియానా గాయపడటంపై సందేహం కలుగుతుంది. రొమాంటిక్‌ సీన్లు తీసే సమయంలో ఇలా జరిగిందేమో అని అంటున్నారు. గాయం చాలా చిన్నదే అయినా ఇలియానా ఇలా సోషల్‌ మీడియాలో పంచుకోవడం పెద్ద ప్రమోషనల్‌ లభించినట్టయ్యింది. 

ఇందులో ఇలియానా డీ గ్లామర్‌ పాత్రలో కనిపించనుంది. నల్లగా కనిపిస్తుందని టాక్‌.  నల్లగా ఉండే అమ్మాయిల పట్ల సమాజం చూపించే పక్షపాతాన్ని చూపించనున్నట్టు తెలుస్తుంది. హర్యానా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుందట.