Asianet News TeluguAsianet News Telugu

తెలుగులో బిజీ కాబోతున్న మలయాళ స్టార్ హీరో, ఇంట్రెస్టింగ్ ఆఫర్లోస్తున్నాయన్న పృథ్విరాజ్

టాలీవుడ్ పై కన్నేశాడు మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్.  ఇక్కడ ఇంట్రెస్టింగ్ మూవీ ఆఫర్స్ వస్తున్నాయట. మరి టాలీవుడ్ పై దండయాత్ర ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాడో.
 

I may direct a Telugu film very soon says Prithviraj Sukumaran
Author
Hyderabad, First Published Jun 26, 2022, 5:10 PM IST


టాలీవుడ్ ప్రస్తుతం ఒక ఫిల్మ్ ఫ్యాక్టరీగా మారిపోయింది. ఫ్రెషర్స్ తో పాటు పక్క లాంగ్వేజ్ నుంచి స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా తెలుగు సినిమాల్లో నటించి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకోవాలి అని చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే.. విజయ్,ధనుష్ లాంటి తమిళ స్టార్ హీరోలు తెలుగులో డైరెక్ట్ సినిమాలు చేస్తున్నారు.. అది కూడా తెలుగు దర్శకులతో.. ఇక మలయాళం వంతు వచ్చింది. ఇప్పటికే మలయాళం నుంచి దేవ్ మోహన్, ఉన్నిముఖుందన్ లాంటి యంగ్ స్టర్స్ తెలుగులో మంచి సినిమాలు చేస్తున్నారు. 

రీసెంట్ గా ఫహద్ ఫజిల్ కూడా తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక మరో మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కూడా టాలీవుడ్ పై కన్నేశాడు. ఇక్కడే వరుస ఆఫర్లు అందిపుచ్చుకోవాలి అని చూస్తున్నాడు. 

పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ , కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్  కాంబినేష‌న్‌లో తెరకెక్కుతోన్న సినిమా స‌లార్ . కేజీఎఫ్ లాంటి భారీ చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కు అందించిన హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో కోలీవుడ్ భామ శృతిహాస‌న్‌  హీరోయిన్‌గా న‌టిస్తోంది. అండ‌ర్ వ‌ర‌ల్డ్ యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో మ‌ల‌యాళ స్టార్ హీరో క‌మ్ డైరెక్ట‌ర్ పృథ్విరాజ్ సుకుమార‌న్ కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విష‌యాన్ని పృథ్విరాజ్ సుకుమారన్ క‌న్ఫామ్ చేస్తూ..రెండేళ్ల క్రితం ప్ర‌శాంత్ నీల్ నాకు స‌లార్ స్క్రిప్ట్ వినిపించారు. నేను చాలా థ్రిల్ అయ్యాను. క‌థ విన్న త‌ర్వాత‌ చాలా ఎక్జ‌యిటింగ్‌గా అనిపించింది. నేను, ప్ర‌శాంత్ త్వ‌ర‌లోనే డేట్స్ స‌ర్దుబాటు పూర్తి చేస్తాం. స‌లార్ క‌థ చాలా అద్బుతంగా ఉంద‌ని చెప్ప‌గ‌ల‌నన‌న్నాడు. అంతేకాదు తెలుగు నుంచి త‌న‌కు ఆస‌క్తిక‌ర ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ని, అన్నీ కుదిరితే బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాల్లో న‌టిస్తాన‌ని చెప్పాడు పృథ్విరాజ్‌. 

ఈ టాలెంటెడ్ హీరోను ఇక తెలుగు ప్రేక్ష‌కులు కూడా సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేయ‌డం గ్యారంటీ అన్న‌ట్టే. ఆర్ట్ డైరెక్ట‌ర్ శివ‌కుమార్ నేత్వత్వంలో స‌లార్ యాక్ష‌న్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉండ‌బోతున్నాయ‌ట‌. విజ‌య్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా.. కేజీఎఫ్ కు స్వ‌రాలు అందించిన ర‌వి బ‌స్రూర్ స‌లార్‌కు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios