Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ తో చిన్న మిస్ కమ్యూనికేషన్.. వివాదం పై స్పందించిన బండ్ల గణేష్

బండ్ల గణేష్ ఎన్టీఆర్ తో రెండు సినిమాలు చేశారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్ షా వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి చిత్రం. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో టెంపర్ మూవీ చేశారు బండ్ల గణేష్, ఎన్టీఆర్. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 

i had an issue with ntr producer bandla ganesh opens up
Author
Hyderabad, First Published Aug 31, 2021, 2:32 PM IST

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంటర్వ్యూ లు అంటే జనాలకు భలే క్రేజ్. విషయం ఏదైనా బండ్ల గణేష్ ఇచ్చే సమాధానాలు బిన్నంగా ఉంటాయి. ఒక్కోసారి ఆవేశంలో ఆయన చేసే కామెంట్స్ హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. అందుకే మీడియా సంస్థలు తరచుగా బండ్ల గణేష్ వెనుకబడుతూ ఉంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్, తనకు ఎన్టీఆర్ తో గల విబేధాలపై నోరు విప్పారు. 


బండ్ల గణేష్ ఎన్టీఆర్ తో రెండు సినిమాలు చేశారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్ షా వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి చిత్రం. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో టెంపర్ మూవీ చేశారు బండ్ల గణేష్, ఎన్టీఆర్. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ఎన్టీఆర్ ని హిట్ ట్రాక్ ఎక్కించిన చిత్రం టెంపర్.

 
కాగా టెంపర్ మూవీ విషయంలో ఎన్టీఆర్, బండ్ల గణేష్ కి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు అప్పట్లో టాక్ నడిచింది. ఇదే విషయాన్ని బండ్ల గణేష్ ని అడుగగా.. ఎన్టీఆర్ తో నాకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వలన చిన్న వివాదం నడిచింది. అన్న దమ్ముల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న విబేధాలు తలెత్తుతాయి. అలాగే ఎన్టీఆర్, నాకు మధ్య చిన్న వివాదం జరిగిందని బండ్ల గణేష్ చెప్పారు. ఆ వివాదం ఏమిటో, ఎందుకు వచ్చిందో బండ్ల గణేష్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే వివాదం తలెత్తిన మాట నిజమని ఆయన ఒప్పుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios