ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ మల్టీస్టారర్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ లతో మల్టీస్టారర్ చేస్తానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు.  


ఆర్ ఆర్ ఆర్ (RRR Movie) విజయం సాధించిన నేపథ్యంలో టాలీవుడ్ లో మరిన్ని మల్టీస్టారర్స్ రూపొందే అవకాశం కలదు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం అరుదైన విషయం. టాలీవుడ్లో ఒకప్పుడు ఈ ట్రెండ్ కొనసాగింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి స్టార్స్ కలిసి పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. అయితే ఆ నెక్స్ట్ జనరేషన్ స్టార్స్ మాత్రం మల్టీస్టారర్స్ పట్ల ఆసక్తి చూపలేదు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున కలిసి నటించలేదు. 

ఇక నందమూరి-మెగా హీరోల మధ్య ఫ్యాన్ వార్ నెలకొన్న నేపథ్యంలో ఈ కుటుంబాల స్టార్స్ కలిసి నటించడం అసంభవం అనుకున్నారు. అయితే రాజమౌళి దీన్ని సాధ్యం చేసి చూపించారు. ఆర్ ఆర్ ఆర్ కి ముందే చరణ్, ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహభావం కలిగి ఉండడంతో ఈ మల్టీస్టారర్ సాధ్యమైంది. ఇద్దరు స్టార్ హీరోల ఇమేజ్ స్క్రీన్ స్పేస్ బ్యాలెన్స్ చేస్తూ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ అద్భుతంగా తెరకెక్కించారు. 

ఇదిలా ఉంటే మహేష్ ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఓ మీడియా ప్రతినిధి ఎన్టీఆర్, చరణ్ కలిసి ఆర్ ఆర్ ఆర్ మూవీ చేశారు. మీరు వీరిలో ఎవరితో కలిసి మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నారని అడుగగా.. ఇద్దరితో చేస్తానని సమాధానం చెప్పారు. ఎన్టీఆర్(NTR), చరణ్ లలో ఎవరితోనైనా మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమేనని ఆయన తెలియజేశారు. 

మరి మహేష్ (Mahesh babu)తో ఎన్టీఆర్ లేక చరణ్ కలిసి నటిస్తే దేశంలోనే అది క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో సందేహం లేదు.అలాగే మరో విలేకరి రాజమౌళి మూవీ డీటెయిల్స్ అడిగారు. మీతో రాజమౌళి హాలీవుడ్ రేంజ్ మూవీ ప్లాన్ చేస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. ఈ రేంజ్ లో మూవీ ఉండనుంది? అని అడుగగా... హాలీవుడ్, బాలీవుడ్ అనేది నాకు తెలియదు. కానీ రాజమౌళి గారి ప్రాజెక్ట్ కోసం నేను ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఇంతకు మించి ఈ మూవీ గురించి నేను ఏమీ మాట్లాడలేను అన్నారు. 

కాగా మహేష్ సర్కారు వారి షూట్ పూర్తి చేశారు. దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తున్న ఈ మూవీ మే 12న విడుదల కానుంది. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న తదుపరి చిత్రం సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.