హై టీఆర్పీ రేటింగ్ లతో దూసుకుపోతున్న జబర్దస్త్ కామెడీ షోను సెక్స్ రాకెట్ వివాదం ఒక్కసారిగా రోడ్డుమీద పెట్టింది. ఇంతకు ముందు ఏవో కొన్ని వివాదాలు వచ్చినా అవి పెద్దగా హైలెట్ కాలేదు. అలాగే గతంలోనూ ధనరాజు...ఓ బ్యూటీ పార్లర్ లో దొరికిపోయినా పెద్ద ఇష్యూ అవలేదు. అందరూ లైట్ తీసుకున్నారు. కాని ఇప్పుడు..హైపర్ ఆది టీమ్ లోని... దొరబాబు, పరదేశీ ఇప్పటికే రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం హాట్ టాపిక్ గా ఉంది. హైపర్ ఆది తన స్కిట్టులలో మెగా ఫ్యామిలీకు వ్యతిరేకంగా ఉండేవారిపై కామెంట్స్ చేయటం, పవన్ ని సపోర్ట్ చేయటం నచ్చనివారికి సందర్బం దొరికినట్లైంది. 

ఓ రకంగా ఇది హైపర్ ఆదికి పెద్ద ఇబ్బందులే  తెచ్చిపెట్టింది. వాస్తవానికి దొరబాబును మొదటి నుంచి ప్రోత్సహించి అతడికి  పేరు తేవడంలో హైపర్ ఆది కృషి ఉంది. అయితే మొదటి నుంచి స్కిట్స్ లో దొరబాబును స్త్రీలోలుడిగా చూపించేవాడు. అదే నిజమైంది. ఇది పెద్దగా హైలెట్ కావటంతో హైపర్ ఆది తల పట్టుకున్నాడు. దాంతో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన మల్లెమాల ప్రొడక్షన్ సంస్థ ఆరోపణలు ఎదుర్కొన్న హైపర్ ఆది టీమ్ మెంబర్స్ పై వివరణ కోరింది. హైపర్ ఆదిని ఏం నిర్ణయం తీసుకుంటావని అడిగింది.

దాంతో హైపర్ ఆది... ఈ వేడి చల్లారేదాకా అంటే రెండు వారాల పాటు ...ప్రస్తుతానికి దొరబాబుని, పరేదేశీని ప్రక్కన పెడతాను అని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మెల్లిగా జనం మర్చిపోయాక, యధాస్దితిని కొనసాగించాలనేది ఆయన ఆలోచనగా చెప్తున్నారు. ఎందుకంటే టీమ్ లో ఇద్దరు వెళ్లిపోతే మళ్లీ అలాంటి వాళ్లను తయారు చేసుకోవాలంటే చాలా టైమ్ పడుతుంది. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్దితి.

వ్యభిచారం కేసులో దొరబాబు.. అదే రోజు అతడి భార్య ఏం చేసిందో తెలుసా!

 అందులోనూ హైపర్ ఆది రాసే పంచ్ లకు పరదేశి ...రచనా సహకారం అందిస్తున్నాడు. అయితే తెర వెనక ఉండి చేసే స్క్రిప్టు కాబట్టి నో ప్లాబ్లం అని, షూట్ కు మాత్రం వద్దని చెప్పారట. ఈ విధంగా హైపర్ ఆది నిర్ణయం తీసుకున్నాడంటూ చెప్పబడుతున్నదాంట్లో ఎంత నిజం ఉందో కానీ, చాలా మంది తప్పుపడుతున్నారు. ఇలాంటి వాళ్లను ఎంకరేజ్ చేయటం పద్దతి కాదని, హైపర్ ఆది పూర్తిగా వీళ్లను ప్రక్కన పెట్టాలని సూచిస్తున్నారు. ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి.
 
 ఇక  తాజాగా విడుదలైన ప్రోమోలో హైపర్ ఆది టీమ్ నుంచి దొరబాబు, పరదేశీ లేకుండా చేసారు. గతంలో సైతం కొందరు ఆర్టిస్టులు క్రమశిక్షణ ఉల్లంఘించగా, వాళ్లకు ఎంత క్రేజ్ ఉన్నా పట్టించుకోకుండా, మల్లెమాల పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే. ముందు ముందు దొరబాబు తరహా ఇన్సిడెంట్స్ చోటు చేసుకోకుండా, మల్లెమాల ఇలా జాగ్రత్త పడుతోందని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.