కరోనా ఉన్నా న్యూ ఇయిర్ ని జనం బాగానే ఎంజాయ్ చేసారు.ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మధ్యం ఏరులై పారింది. దాంతో పోలీస్ లుకు పనిపడింది.  దాంతో పోలీసులు  డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేస్తూ మళ్లీ మందుబాబుల పనిపడుతున్నారు. అయితే పోలీసులు కుర్రాళ్లకు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా వారు వినడం లేదు. ఎన్ని డ్రంకెన్ డ్రైవ్ లు నిర్వహించినా ఫలితం ఉండటం లేదు. దాంతో కాస్త వాళ్ల రూట్ లోకి వెళ్లి బుర్రలోకి ఎక్కించాలని డిసైడ్ అయ్యారు. సోషల్ మీడియాలో ఉండే కుర్రకారు కోసం స్పెషల్ గా కొన్ని పోస్టర్స్ లాంటివి రెడీ చేసి వదులుతున్నారు. 

  ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో బాలక్రిష్ణను ఈ ప్రచారానికి వాడుకున్నారు. ఈ నేపధ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ సోషల్ మీడియా ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. హీరో నందమూరి బాలకృష్ణ ఫొటో పెట్టి  ఆయన చెప్పిన డైలాగ్ ఒకదాన్ని తీసుకొని మందుబాబులకు వేసిన పంచ్ దుమ్ము రేపుతోంది.

మీకు గుర్తుందా లేదో...బాలయ్య ‘లయన్’ సినిమాలో పేల్చిన ‘అప్పుడే అయిపోయిందని అనుకోకండి.. లోపల ఇంకా చాలా దాచిపెట్టాం’ అనే డైలాగును హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీసుకొని ‘అప్పుడే అయిపోయిందని అనుకోకండి.. ఇంకా చాలా ఉంది. వీకెండ్ గురించి దాచి ఉంచాం’ అని బాలయ్యను పెట్టి క్యాప్షన్ ఇచ్చారు. వెనుకాల డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న ఫొటో పెట్టారు. కొత్త సంవత్సరం వేళ ప్రజలకు వార్నింగ్ గా పోలీసులు చేసిన ఈ పోస్టు వైరల్ గా మారింది.