హైదరాబాద్ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తున్న ఇద్దరు హిరోయిన్ల అరెస్ట్

First Published 17, Dec 2017, 12:41 PM IST
hyderabad police arrested two heroines involving prostitution in star hotel
Highlights
  • వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ హిరోయిన్లు
  • హైదరాబాద్ ఫైవ్ స్టార్ హోటల్ తాజ్ డెక్కన్ లో పట్టుబడ్డ తారలు
  • ఇద్దరు హిరోయిన్లతోపాటు మరో నిందితుడి అరెస్ట్

సినీతతారలు వ్యభిచారం చేస్తూ పట్టుబడటం సర్వ సాధారణంగా మారింది. తాజాగా మరో సారి సినీ తారల సెక్స్ వ్యవహారం గుట్టు రట్టయింది. హైదరాబాద్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో వ్యభిచారం చేస్తున్న సినీ నటిని తాజాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం ఆధారంగా వలపన్నిన పోలీసులు ముందుస్తుగా అందిన సమాచారంతో నిర్వహించిన దాడుల్లో సినీ నటి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిందని పోలీసులు తెలిపారు.

 

హైదరాబాద్ లోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటలైన బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 1లోని తాజ్‌ డెక్కన్‌లో ఈ వ్యభిచారం వ్యవహారం గుట్టు రట్టయింది. ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందిందని, ధనవంతుల బిడ్డలను ఆకర్షిస్తూ రాత్రికి రూ.లక్ష, ఆ పైన డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసిందని పోలీసులు చెప్పారు.

 

“శనివారం రాత్రి నిఘా పెట్టి హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్న గదిపై దాడి చేశాం. సినీ నటిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నాం. ఆమెకు సహకరిస్తున్న మోనీష్‌ కడాకియాతో పాటు హోటల్‌ మేనేజర్‌ను అరెస్టు చేశాం” అని  నార్త్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు తెలిపారు.

 

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం ముంబై నుంచి సినీనటి హైదరాబాద్‌కు వచ్చినట్టు తెలిసింది. ప్రముఖ హోటల్‌లో బస చేసి వ్యభిచారం నడుపుతున్నట్టు పక్కా సమాచారం అందింది. ఆ మేరకు దాడి చేశాం అని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు మనీష్‌ను విచారిస్తున్నాం. ఈ సెక్స్ రాకెట్ వెనుక ఎవరు ఉన్నారు అనే కోణంలో విచారిస్తున్నాం.

 

ఇదిలా ఉండగా, మరో హోటల్‌పై జరిపిన దాడిలో మరో సినీనటి కూడా అరెస్ట్ అయింది. ఆమెను బెంగాలీ సినీ నటిగా గుర్తించారు.

loader