బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రిష్ సిరీస్ ప్రాంఛైజీతో ఇండియాలో సూపర్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. హృతిక్ కటౌట్ కూడా అలాగే ఉంటుంది.
బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రిష్ సిరీస్ ప్రాంఛైజీతో ఇండియాలో సూపర్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. హృతిక్ కటౌట్ కూడా అలాగే ఉంటుంది. హృతిక్ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ అభిమానులంతా క్రిష్ 4 కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం హృతిక్ రోషన్ తమిళ బ్లాక్ బస్టర్ విక్రమ్ వేద రీమేక్ లో నటిస్తున్నారు. ఈ మూవీలో మరో హీరోగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వర్షన్ ని తెరకెక్కించిన గాయత్రీ, పుష్కర్ లే హిందీ రీమేక్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే విక్రమ్ వేద హిందీ టీజర్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చిత్రాన్ని సెప్టెంబర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.
అయితే హృతిక్ రోషన్ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ కొంచెం కూడా గర్వం ఉండదని బాలీవుడ్ ప్రముఖులు చెబుతుంటారు. తాజాగా అది నిజం అయింది. హృతిక్ రోషన్ ఇటీవల ముంబైలో ఓ ఈవెంట్ కి హాజరయ్యారు. అక్కడ హృతిక్ రోషన్ చేసిన పని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
హృతిక్ రోషన్ వేదికపై ఉండగా ఓ అభిమాని వేగంగా వచ్చి అతడి కాళ్ళు మొక్కారు. వెంటనే హృతిక్ కూడా అభిమాని కాళ్లకు నమస్కరించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హృతిక్ రోషన్ లాగా మరొక సెలెబ్రిటీ ఉండడం కష్టం అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
