హృతిక్ రోషన్ పేరు చెప్పగానే క్రిష్ ప్రాంచైజీ గుర్తుకు వస్తుంది. ఆ చిత్రంలో హృతిక్ ని తప్ప మరో హీరోని ఊహించుకోలేం. ఆ ఫిక్షనల్ క్యారెక్టర్ లో హృతిక్ బాగా ఒదిగిపోయాడు. సూపర్ హీరోలంటే హాలీవుడ్ వాళ్ళని తప్ప మరొకరిని ఊహించుకోలేని రోజుల్లో మనకు కూడా హృతిక్ రూపంలో ఓ సూపర్ హీరో దొరికాడు. 

ప్రస్తుతం దేశం మొత్తం క్రిష్ 4 చిత్రం కోసం ఎదురుచూస్తోంది. కొన్ని నెలల క్రితమే క్రిష్ 4కి సంబంధించిన వర్క్ ప్రారంభమైంది. కానీ దర్శకుడు, హృతిక్ రోషన్ తండ్రి అయిన రాకేష్ రోషన్ ఇటీవల క్యాన్సర్ బారీన పడ్డారు. క్యాన్సర్ ప్రాధమిక దశలోనే ఉండడంతో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఈ విషయాన్ని హృతిక్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 

వార్ తర్వాత నేను చేయబోయే చిత్రం క్రిష్ 4. త్వరలో మా తండ్రితో కలసి ఈ చిత్రానికి సంబంధించిన వర్క్ ప్రారంభించబోతున్నాం. మా నాన్న క్యాన్సర్ కు గురికావడం వల్ల ఈ ప్రాజెక్ట్ పనులు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం ఆయన కోలుకున్నారు అని హృతిక్ రోషన్ తెలిపాడు. క్రిష్ సిరీస్ లో ఇప్పటి వరకు కోయి మిల్గయా, క్రిష్, క్రిష్ 3 చిత్రాలు వచ్చాయి. క్రిష్ 4 ఈ మూడు చిత్రాలకంటే భారీ స్థాయిలో ఉండబోతోంది.