సినిమాల్లో హాట్ హాట్ సీన్లు సర్వ సాధారణం.  షూటింగ్ సమయంలో చాలా జాగ్రత్తులు సీసుకుని హాట్ సీన్ల‌న్నీ ప‌క‌డ్బందీగా చిత్రీక‌రిస్తారు. ఏమాత్రం అలసత్వంగా  ఉన్నా ఆ సీన్ల‌న్నీ సోష‌ల్ మీడియాలో ప్రత్యక్ష్యమవుతాయి. 

ఆ మధ్యన ఓ హీరోయిన్ ఓ సినిమా నిమిత్తం బాత్రూంలో ట‌వ‌ల్ క‌ట్టుకొని ఉన్న సీన్ కు చెందిన షూటింగ్ పార్ట్ నెట్ లో కనపడి..ఆమెను కంగారుపెట్టింది. కేసు పోలీస్ ల దాకా వెళ్లింది.   ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ...జనవరి నెలలో తన ప్రమేయం లేకుండా ఓ తలనొప్పిలో ఇరుక్కున్నారు. ఆయన ఆఫీస్ లో షూట్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారి ఆయనకు చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. 

భోజపురికి చెందిన దర్శక,నిర్మాత ఉపేంద్ర కుమార్ వర్మ చేసిన ఓ చెత్త పనితో ఆయన పై రకరకాల రూమర్స్ వచ్చాయి.    వివరాల్లోకి వెళితే.... ఉపేంద్రకుమార్ ఓ వెబ్ సీరిస్ ప్లానింగ్ నిమిత్తం ఓ  షార్ట్ ఫిల్మ్ చేసారు. అది ఓ సెల్ ఫోన్ తో చిత్రీకరించారు. ముంబైలోని వెస్ట్ అంథేరీలో ఉన్న రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ లో తీసారు. డెమో కోసం ప్లాన చేసిన ఆ వీడియోలో ఓ సన్నివేశంలో హీరోయిన్ టవల్ తో కనిపించాలి. 

సినిమా పరిశ్రమలో అవకాసాలు కోసం తిరుగుతున్న  ఓ అమ్మాయి..సరే అని ఒప్పుకుని  షూట్ లో పాల్గొంది. అయితే ఊహించని విధంగా హీరోయిన్ ఒంటిపై ఉన్న ట‌వ‌ల్ జారీ పోవ‌డం , ఆ సీన్ల‌న్నీ వీడియోలు రికార్డు అయ్యాయి. అయితే వాటిని డిలేట్ చేసేసామని, డోంట్ వర్రీ అని చెప్పారు.   కానీ కొద్ది రోజులుకు   ఆ సీన్లు నెట్టింట్లో ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో  షాకైన స‌ద‌రు హీరోయిన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది . 

హీరోయిన్ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకొని పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. అయితే వర్మ ఆఫీస్ లో ఆ సంఘటన జరగటం, ఆ సన్నివేశం షూటింగ్ జరగటంతో ఆయన ప్రమేయం ఉందంటూ మీడియాలో వార్తలు రావటం మొదలెట్టాయి.   మరో ప్రక్క ఉపేంద్రకుమార్ తప్పించుకు తిరిగుతున్నాడు.పోలీస్ ల కన్నుగప్పి ,సెల్ ఫోన్ సిమ్ లు మారుస్తు పరారిలో ఉన్నారు. 

రీసెంట్ గా పోలీస్ లు అతని ఎడ్రస్ ని ట్రేస్ చేసి పట్టుకున్నారు. 9 వ జోన్ కు చెందిన డిప్యూటికమీషనర్ ఆఫ్ పోలీస్...  పరమ్ జిత్ సింగ్... అతని అరెస్ట్ ని ఖరారు చేసారు. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ ఊపిరి పీల్చుకున్నారు.