భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ కియారా అద్వానీ. ఆ తరువాత కియారా చేసిన వినయ విధేయ రామ డిజాస్టర్ కావటంతో అమ్మడి తెలుగులో అవకాశాలు రాలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా లస్ట్ స్టోరీస్‌తో బోల్డ్ సీన్స్‌లో నటించి షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ కుర్రకారు గుండెల్లో చెరగని ముద్రవేసింది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ మైథలాజికల్‌ మూవీ ఆదిపురుష్‌లోనూ సీతగా కియారా పేరు వినిపిస్తోంది. అయితేన్ని అవకావాలు ఈ ముద్దుగుమ్మను వెత్తుకుంటూ రావడానికి అమ్మడి గ్లామరే కారణం అంటున్నారు. అయితే ఆ గ్లామర్ సీక్రెట్ ఏంటో కూడా బయటపెట్టేసింది కియారా.

స్కిన్‌ డిసీజెస్‌కు గురికాకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట కిరాయా. మేకప్‌ విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది ఈ బ్యూటీ. అంతేకాదు తన నిగారింపు కోసం అమ్మమ్మ చెప్పిన ఓ సీక్రెట్‌ను ఇప్పటికీ ఫాలో అవుతుందట. `తేనె, శనగపిండి, క్రీమ్, పాలు, నిమ్మరసం కలిపి మిశ్రమాన్ని ముఖం మీద ఫేస్‌ ప్యాక్‌ లా అప్లై చేసి కొద్ది రోజుల పాటు ఉంచుతాను, ఆ ప్యాక్‌ నా స్కిన్‌లో కొత్త నిగారింపు తీసుకువస్తుంద`ని చెప్పింది ఈ బ్యూటీ.