డైరెక్టర్ ని పెనంతో కొట్టిన హీరోయిన్.. కారణమేమిటంటే!

heroine anjali hurts lisa movie director during shooting
Highlights

అసలు విషయంలోకి వస్తే.. కోలీవుడ్ లో 'లీసా' అనే సినిమాలో నటిస్తోంది అంజలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే యాక్షన్ సీన్ చిత్రీకరించే సమయంలో అంజలి తన చేతిలో ఉండే దోస పెనంను కెమెరా ముందుకు విసిరేయాలి

తెలుగమ్మాయి అంజలి టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. అయితే తెలుగులో కంటే ఈ భామకు తమిళంలో మంచి క్రేజ్ ఉంది. అక్కడ టాప్ హీరోల సరసన నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది. అప్పుడప్పుడు తెలుగు చిత్రాల్లో కూడా మెరుస్తోంది ఈ బ్యూటీ. తాజాగా అంజలి డైరెక్టర్ ని పెనంతో కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో సదరు డైరెక్టర్ కి తీవ్ర గాయం అయినట్లు తెలుస్తోంది.

అసలు విషయంలోకి వస్తే.. కోలీవుడ్ లో 'లీసా' అనే సినిమాలో నటిస్తోంది అంజలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే యాక్షన్ సీన్ చిత్రీకరించే సమయంలో అంజలి తన చేతిలో ఉండే దోస పెనంను కెమెరా ముందుకు విసిరేయాలి. డైరెక్టర్ చెప్పినట్లుగా అంజలి కూడా చేసింది. కానీ అది పొరపాటున వెళ్లి డైరెక్టర్ ముఖానికి తాకింది. దీంతో ఆయన కనుబొమ్మల మధ్య చిట్లి పెద్ద గాయమైంది.

వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లి గాయానికి కుట్లు వేయించినట్లు తెలుస్తోంది. తన వలన డైరెక్టర్ కి దెబ్బ తాకడంతో అంజలి తెగ బాధపడిపోతోందట. అయితే షూటింగ్ లో ఇలాంటివి సహజమని పట్టించుకోకూడదని టీమ్ సభ్యులు అంజలికి చెప్పి సముదాయించినట్లు తెలుస్తోంది. 

loader