రెండు బిగ్ ఈవెంట్స్ ఒకే సీజన్ లో వచ్చిపడ్డాయి. క్రికెట్ లవర్స్ ఫేవరేట్ ఈవెంట్ ఐపీఎల్ మరియు బిగ్ బాస్ షో ఏక కాలంలో ప్రసారం కావడం ఇబ్బందిగా మారింది. ఎంతైనా ఐపీఎల్ లాంటి మెగా టోర్నీ ముందు బిగ్ బాస్ నిలబడడం చాలా కష్టం. దానికి తోడు ఐపీఎల్ మరియు బిగ్ బాస్ ప్రసార సమయాలు కూడా ఒకటే. దీనితో బిగ్ బాస్ షోకి భారీ డ్యామేజ్ జరిగేలా కనిపిస్తుంది. దీనికోసం బిగ్ బాస్ యాజమాన్యం నష్టనివారణ చర్యలపై దృష్టిసారించింది. 

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విషయంలో ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. హౌస్ లోకి వెళ్లిన చాలా మంది ముక్కుముఖాలు ఎవరికీ తెలియదు. ఇది ఒక మైనస్ గా బిగ్ బాస్ షోకి మారింది.  దీనికి తోడు ఐపీఎల్ కూడా ప్రారంభం కావడం మరింత తలనొప్పిగా మారింది. అందుకే రెండు వారాల వ్యవధిలోనే ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను హౌస్ లోకి పంపించారు. కుమార్ సాయి, జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 

అయినప్పటికీ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోతున్నారు. దీని కోసం షో కి మరింత ఆదరణ తెచ్చేలా యంగ్ హీరోయిన్ స్వాతి దీక్షిత్ ని రంగంలోకి దించనున్నారట. త్వరలోనే ఆమె హౌస్ లోకి ఎంటర్ కానుందని సమాచారం. ఇప్పటికే స్వాతి దీక్షిత్ హౌస్ లోకి  వెళ్లనున్నట్లు వార్తలు రావడం జరిగింది. ఐతే ఈమె ఎంట్రీని నిర్వాహకులు హోల్డ్ లో పెట్టారట. కానీ ఐపీఎల్ దెబ్బకు ఈమె ఎంట్రీ ఖాయం చేసినట్లు తెలుస్తుంది.