Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ నాన్ వెజ్ విందుకు శృతి హాసన్ మైండ్ బ్లాక్!

ప్రభాస్ లో ఉన్న మరో ప్రత్యేకత తన తోటి హీరోయిన్స్ కి తన మార్కు ఆంధ్రా రుచులు చూపించడం. స్వీట్స్, హాట్స్, వెజ్, నాన్ వెజ్ అనే తేడా లేకుండా సహ నటులకు ప్రభాస్ అద్భుతమైన వంటకాలు స్వయంగా వండించి సిద్ధం చేస్తారు. 
 

heroin shruti haasan overwhelmed with prabhas non veg food treat
Author
Hyderabad, First Published Aug 8, 2021, 8:24 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డార్లింగ్ ప్రభాస్ తన పేరును ఎప్పుడూ సార్ధకం చేసుకుంటూ ఉంటారు. తనతో పని చేసిన కో స్టార్ ఎవరైనా ప్రభాస్ చాలా మంచోడు, నిజంగా డార్లింగ్ అంటూ కితాబు ఇస్తారు. ఇక ప్రభాస్ లో ఉన్న మరో ప్రత్యేకత తన తోటి హీరోయిన్స్ కి తన మార్కు ఆంధ్రా రుచులు చూపించడం. స్వీట్స్, హాట్స్, వెజ్, నాన్ వెజ్ అనే తేడా లేకుండా సహ నటులకు ప్రభాస్ అద్భుతమైన వంటకాలు స్వయంగా వండించి సిద్ధం చేస్తారు. 

సాహో మూవీ షూటింగ్ సమయంలో శ్రద్దా కపూర్ ప్రభాస్ ట్రీట్ కి ఫిదా ఐపోయారు. ప్రభాస్ తనకు సరికొత్త రుచులు పరిచయం చేసినట్లు, ఆయన వడ్డించిన వంటకాలు ఎప్పటికీ మరచిపోలేనని చెప్పడం జరిగింది. తాజాగా ఈ లిస్ట్ లో హీరోయిన్ శృతి హాసన్ చేరారు. సలార్ మూవీ షూటింగ్ కోసం ప్రభాస్, శృతి కలుస్తుండగా ఆమెకు అనేక రకాల నాన్ వెజ్ ఐటమ్స్ తో విందు ఏర్పాటు చేశాడట ప్రభాస్. 


ప్రభాస్ శృతి కోసం ఏర్పాటు చేసిన మెనులో పురాతన వంటకాలు, అరబిక్ స్టైల్  మాంసం, గోంగూర మాంసం, బిరియానీ, దుబాయ్ స్టైల్  మండి బిర్యానీ, చికెన్, మటన్, పీతలు, రోయ్యల పులుసు, మటన్ కర్రీల్లో రకాలు అన్నింటిని ప్రభాస్ కారణంగా శ్రుతి టేస్ట్ చేసేసిందిట. అలాగే కొన్ని రకాల వెజ్ ఐటమ్స్ కూడా తయారు చేయించారని  ఓ వీడియో ద్వారా తెలిపింది. నాన్ వెజ్ లో ఇన్నిరకాలు ఎప్పుడూ రుచి చూడలేదని..ప్రభాస్ ని ఈ సందర్భంగా అత్యంత పురాతన వంటకాలు తినే పురాతన మానవుడని అభివర్ణించింది. 

ప్రభాస్ తనపై చూపించిన ఈ ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేనని శ్రుతి హాసన్ తెలిపింది. ఇటీవల సీనియర్ నటి నదియా సైతం ప్రభాస్ ఆతిధ్యం, సెట్స్ లో ఆయన ప్రవర్తించే తీరును ఎంతగానో పొగిడారు. పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సింపుల్ గా అందరితో ప్రభాస్ కలిసిపోతారని ఆమె చెప్పారు. మరోవైపు ప్రభాస్ రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ చిత్రాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్ట్ కే ఇటీవల లాంచ్ అయ్యింది. 

Follow Us:
Download App:
  • android
  • ios