Asianet News TeluguAsianet News Telugu

వైరల్ వీడియో...  బాక్సింగ్ భామగా రకుల్,  జిమ్ ఫిట్ లో చెమటలు పట్టిస్తూ సూపర్ హాట్ గా

రకుల్ జిమ్ లో చెమటలు చిందిస్తున్నారు. తాజాగా రకుల్ జిమ్ వేర్ లో లెగ్ తో కిక్ లు హాండ్స్ తో పంచెస్ ఇస్తూ... బాక్సింగ్ భామగా మారిపోయారు. 
 

heroin rakul turns boxing girl her latest instagram video goes viral ksr
Author
Hyderabad, First Published Jul 10, 2021, 7:06 PM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన రకుల్ ప్రీత్, ఫుల్ ఫోకస్ బాలీవుడ్ పై పెట్టింది. వరుస ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా స్టార్ గా ఎదగాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. అలా అని సౌత్ ని పూర్తిగా వదిలేయలేదు. తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఆఫర్స్ కాదనకుండా చేస్తున్నారు. 


తెలుగులో రకుల్ లేటెస్ట్ మూవీ చెక్. నితిన్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన ఆ క్రైమ్ థ్రిల్లర్ అనుకున్నంత విజయం సాధించలేదు. కాగా దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఓ మూవీలో రకుల్ నటించారు. డెబ్యూ మూవీ ఉప్పెనతో ప్రభంజనం సృష్టించిన మెగా హీరోగా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించారు. ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి కాగా, కారణం ఏమిటో ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. 

అలాగే అక్టోబర్ 31 లేడీస్ నైట్ పేరుతో తెరకెక్కనున్న ఓ మూవీకి రకుల్ సైన్ చేశారు. తెలుగు తమిళ భాషల్లో ఈ మూవీ తెరకెక్కనుంది. చేతినిండా సినిమాలతో కెరీర్ టాప్ గేర్ లో దూసుకెళుతుండగా, రకుల్ ఫుల్ హ్యాపీగా ఉంది. మరి ఇంత బిజీ షెడ్యూల్ హ్యాండిల్ చేయాలంటే ఫిట్నెస్, ఎనర్జీ తప్పనిసరి. దాని కోసం రకుల్ జిమ్ లో చెమటలు చిందిస్తున్నారు. తాజాగా రకుల్ జిమ్ వేర్ లో లెగ్ తో కిక్ లు హాండ్స్ తో పంచెస్ ఇస్తూ... బాక్సింగ్ భామగా మారిపోయారు. 


సీరియస్ గా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న రకుల్ తన వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. జిమ్ వేర్ లో రకుల్ సూపర్ హాట్ గా ఉండగా, వీడియో వైరల్ గా మారింది. ఫిట్నెస్ ఫ్రీక్ గా పేరున్న  రకుల్ గంటల తరబడి జిమ్ లో వ్యాయామం చేస్తూ ఉంటారు. కఠిన కసరత్తులు, ఆరోగ్యకరమైన డైట్ ఆమె దిన చర్యలో భాగంగా ఉంటాయి. 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)

Follow Us:
Download App:
  • android
  • ios