బాలీవుడ్ తరువాత అంతటి స్థాయిలో డ్రగ్స్ వివాదం కన్నడ పరిశ్రమలో చెలరేగింది. వెండితెరకు చెందిన నటులతో పాటు బుల్లితెర సెలెబ్రిటీలు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబడ్డారు. హీరోయిన్స్ రాగిణి ద్వివేది, సంజనా గల్రాని డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం కలకలం రేపింది. వీరిద్దరినీ పోలీసులు పరప్పణ అగ్రహార జైలుకు తరలించి విచారించారు. కోట్లలో వీరు ఆస్తులు కలిసి ఉన్నారని అధికారులు గుర్తించారు. రాగిణి ద్వివేది, సంజనా గల్రాని తమకు బైలు మంజూరు చేయాలని పలుమార్లు కోరుకోవడం జరిగింది. 

ఆరోగ్య కారణాల రీత్యా సంజనా గల్రానికి బైలు రావడంతో ఆమె బయటికి వచ్చారు. సెప్టెంబర్ 4న అరెస్ట్ కాబడ్డ రాగిణి ద్వివేది మాత్రం ఇంకా జైలులోనే ఉన్నారు. తాజాగా బెయిల్ కోసం ఆమె ఏకంగా సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. అయితే సుప్రీం కోర్ట్ సైతం రాగిణి బెయిల్ అభ్యర్ధనను తిరస్కరించారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని ఆమె తరుపు న్యాయవాది విన్నవించడం జరిగింది. 

ఐతే కర్ణాటక క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంజనా లాయర్ వాదనలు తోసిపుచ్చారు. డ్రగ్స్ పెడ్లర్స్ తో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నట్లు తెలియజేశారు. అలాగే ఆమె బయటకు రావడం వలన సాక్ష్యాలు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని కోర్ట్ కి చెప్పడంతో.. ఏకీభవించిన సుప్రీం కోర్ట్.. రాగిణి ద్వివేదికి బెయిల్ నిరాకరించింది. దీనితో నాలుగు నెలలో జైలు జీవితం గడుపుతున్న రాగిణికి మరలా నిరాశ ఎదురైంది.