Asianet News Telugu

బ్రేకింగ్ న్యూస్... డ్రగ్స్ కేసులో ప్రియుడితో పాటు హీరోయిన్ అరెస్ట్!

శాంతాక్రూజ్‌ పోలీసుల సమాచారం మేరకు  జుహులోని ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నైరా నేహాల్ డ్రగ్స్ పార్టీ జరుపుకున్నారు.పార్టీ నుంచి డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

heroin naira nehal shaw arrested in drugs case ksr
Author
Hyderabad, First Published Jun 15, 2021, 1:16 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపలకు బ్రేక్ పడే సూచనలు కనిపించడం లేదు. తాజాగా ఓ యువనటి డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.డ్రగ్స్ ఆరోపణలై నటి నైరా నేహాల్‌ షా తోపాటు ఆమె  స్నేహితుడు అశిక్‌ సాజిద్‌ హుస్సేన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఓ లగ్జరి హోటల్‌లో నైరా నేహాల్  తన స్నేహితులతో కలిసి జరుపుకున్న బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ ఉపయోగించారన్న ఆరోపణలతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. 

 

శాంతాక్రూజ్‌ పోలీసుల సమాచారం మేరకు  జుహులోని ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నైరా నేహాల్ డ్రగ్స్ పార్టీ జరుపుకున్నారు.పార్టీ నుంచి డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గోవాకు చెందిన మిత్రుడు ఆశిక్ హుస్సేన్ తో పాటు నైరా ఈ పార్టీలో పాల్గొన్నారు.ఇక వీరిద్దరికీ పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ అలవాటు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. పక్కా సమాచారంతో తెల్లవారుజామున హోటల్‌పై పోలీసులు దాడి చేశారు. 

అరెస్ట్ అనంతరం నైరా మరియు ఆమె మిత్రుడుని జైలుకు తరలించారు.అయితే నైరా నేహాల్, ఆశిక్ హుస్సేన్ లకు బెయిల్ లభించినట్లు సమాచారం.  కేసు నమోదు చేసి దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. వీరికి డ్రగ్స్ ఎవరు విక్రయించారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇక నైరా నెహ్వాల్ రెండు తెలుగు సినిమాలతో పాటు, కొన్ని హిందీ చిత్రాలలో నటించినట్లు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios