కరోనా కష్టాలు ఎలా ఉన్నా పెళ్లిళ్ల కోలాహలం ఆగడం లేదు. అనేక పరిశ్రమలకు చెందిన హీరో, హీరోయిన్స్ ఈ ఏడాది పెళ్లిళ్లు చేసుకొని ఓ ఇంటివారయ్యారు. టాలీవుడ్ లో నిఖిల్, నితిన్ మరియు రానా కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. కాగా మలయాళ నటి మియా జార్జి పెళ్లి శనివారం కొచ్చిలో ఘనంగా జరిగింది. వ్యాపారవేత్త అశ్విన్ ఫిలిప్ ని ఆమె వివాహం చేసుకున్నారు. 

బంధు మిత్రుల సమక్షంలో క్రిస్టియన్ సంప్రదాయంలో ఈ వివాహం జరిగింది. కరోనా నేపథ్యంలో అత్యంత సన్నిహితులు, బంధువులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారని సమాచారం. ఇక కొన్నాళ్లుగా ఈ జంట ప్రేమలో ఉన్నట్లు వినికిడి. జులైలో వీరి నిశ్చితార్ధం కాగా నిన్న శనివారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట తమ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైరల్ గా మారాయి. 

ఇక టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన మియా జార్జ్, 2010లో వచ్చిన ఓరు స్మాల్ ఫ్యామిలీ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యారు. చెత్తయీస్ అనే మూవీతో హీరోయిన్ గా మారారు. 2017లో వచ్చిన కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఉంగరాల రాంబాబు మూవీలో మియా నటించడం జరిగింది. తమిళ పరిశ్రమలో ఈమె ఎక్కువగా సినిమాలు చేయడం జరిగింది. హీరో విక్రమ్ నటిస్తున్న కోబ్రా మూవీలో కూడా మియా నటించడం విశేషం.