Asianet News TeluguAsianet News Telugu

Disha Patani:దిశా పటాని హాట్ వర్క్ అవుట్ వీడియో వైరల్!

ఫిట్నెస్ ఫ్రీక్ దిశా పటాని వర్క్ అవుట్ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బ్యాక్ చూపిస్తూ దిశా వీడియో చూస్తున్న నెటిజెన్స్ కి కూడా చెమటలు పట్టించారు. దిశా పటాని వీడియో వైరల్ గా మారింది.
 

heroin disha patani hot work out video getting viral
Author
Hyderabad, First Published Mar 17, 2022, 7:42 PM IST | Last Updated Mar 17, 2022, 7:42 PM IST

హీరోయిన్ దిశా పటాని (Disha Patani)కి ఫిట్నెస్ అంటే పిచ్చి. జీరో సైజ్ బాడీ కోసం ఆమె గంటల తరబడి జిమ్ లో శ్రమిస్తారు. దిశా కర్వ్డ్ బాడీ సూపర్ హాట్ అని చెప్పాలి. కష్టపడి సాధించిన శరీర సోయగాలను దాచుకోకుండా చూపించడం అమ్మడికి మహా ఇష్టం. బీచ్ కనపడితే చాలు బికినీలో వాలిపోతుంది. దిశా పటాని టూ పీస్ బికినీ ఫోటోలు తరచుగా సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటాయి. తాజాగా దిశా పటాని జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న వీడియో షేర్ చేశారు. వీపు సాంతం కనిపించేలా ఉన్న ఆమె డ్రెస్ నెటిజెన్స్ కి మైండ్ బ్లాక్ చేస్తుంది. 

దిశా పటాని లేటెస్ట్ వీడియో వైరల్ గా మారింది. ఇక దిశా సిల్వర్ స్క్రీన్ జర్నీ మొదలైంది తెలుగు చిత్రంతోనే కావడం విశేషం. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఆమెను వెండితెరకు పరిచయం చేశారు. 2015లో విడుదలైన లోఫర్ మూవీతో ఆమె నటిగా మారారు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ మూవీ అనుకున్నంతగా ఆడలేదు. ఆమె గ్లామర్ కి బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో తెలుగు పరిశ్రమకు టాటా చెప్పేసింది. 

గత ఏడాది సల్మాన్ కి జంటగా దిశా రాధే మూవీ చేశారు. ఈ మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం దిశా చేతిలో మూడు హిందీ చిత్రాలున్నాయి. ఏక్ విలన్ రిటర్న్స్ మూవీలో జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ హీరోలుగా నటిస్తున్నారు. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా లేటెస్ట్ మూవీ యోధ తో పాటు కిత్నా అనే మరో హిందీ చిత్రం చేస్తున్నారు. ఇక బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తో చాలా కాలంగా దిశా ప్రేమాయణం నడుపుతుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios