హీరోయిన్ అనుష్క శర్మ కొద్దిరోజుల క్రితం తల్లికాబోవుతున్న విషయాన్ని తెలియజేసింది. భర్త విరాట్ కోహ్లీతో కలిసి ఆమె ఓ ఫొటోకు పోజివ్వగా, ఆ ఫోటోలో అనుష్క శర్మ గర్భవతి కాబోతుందన్న విషయం స్పష్టంగా అర్థం అయ్యింది. ప్రస్తుతం మేమిద్దరం, జనవరి 2021న ముగ్గురం కాబోతున్నాం అని సందేశం కూడా పోస్ట్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లమంది అభిమానులు విరాట్ ఖోహ్లి, అనుష్క జంటకు కంగ్రాట్స్ చెప్పారు.
 
మిలియన్స్ లో లైక్స్, లక్షలలో కామెంట్స్ ఆ ఫోటో సొంతం చేసుకుంది. తాజాగా అనుష్క శర్మ మరో ఫోటో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె ముంబై సముద్ర తీరాన నిలుచొని తన గర్భాన్ని చూస్తూ మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. ఫొటోతో పాటు 'మనలో ఓ జీవ సృష్టిని అనుభవించడం కంటే వాస్తవం ఏముంటుంది? అది మన నియంత్రణలో లేనప్పుడు అది ఏమిటీ? ' అని కామెంట్ పెట్టారు. 

తల్లిగా మరో జీవానికి ప్రాణం పోయడంకంటే గొప్ప విషయం ఏముంటదని అనుష్క తన తల్లితనానికి మురిసిపోతుంది. ఇక మరో నాలుగు నెలలో అనుష్క మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. కాగా మరో వైపు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పౌరాణిక చిత్రం ఆదిపురుష్ మూవీలో సీతగా ఆమె నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ బాలీవుడ్ లో ప్రచారం అవుతుంది.